Christmas Special ఈ క్రిస్మస్కు మరింత అందంగా కనిపించాలా? వీటిని ట్రై చేయండి
Christmas Special | పచ్చని క్రిస్మస్ చెట్లు, ఎర్రని శాంతా క్లాజ్ బొమ్మలు, మిరుమిట్లు గొలిపే నక్షత్రాలు.. డిసెంబర్లో ఎక్కడ చూసినా క్రిస్మస్ సంబురాలే. మరి ధరించే దుస్తులు, అలంకరించుకునే నగల్లోనూ క్రిస్మస్ ప్రత్యేకత కనిపించాలి కదా. దీనికి జవాబే నక్షత్రాలు, శాంతా క్లాజ్‌లను పొదిగిన ప్రత్యేక ఆభరణాలు.

క్రిస్మస్ అంటే చాలు.. ఇంట్లోని ప్రతి అంగుళాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. అంతకంటే అందంగా అందమైన గౌన్లు, వజ్రాలు పొదిగిన అపురూపమైన ఆభరణాల్లో దేవదూతల్లా మెరిసిపోతారు. శాంతా తాత బుల్లి ఆకారంలో ఒదిగిపోయి చెవులకు వేలాడుతూ ఉంటాడు. ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాలు జుంకాలుగా, బ్రేస్‌లెట్లుగా, పెండెంట్లుగా కొలువుదీరుతాయి. బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలతో చేసిన సిలువలు దర్శనమిస్తాయి. అందని తారలు, అందరికీ ఆదర్శమైన శాంతా, మంచికి చిరునామాగా నిలిచే క్రిస్మస్ చెట్టు ఇవన్నీ క్రిస్మస్ ఆభరణాల్లో ప్రత్యేకతను చాటుకుంటాయి.

వజ్రాల బహుమతులు..
క్రిస్మస్ రోజు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితి. ఈ బహుమతుల్లో ఎక్కువగా ఉండేవి ఆభరణాలే. వజ్రాలు పొదిగిన ఉంగరాలు, నెక్లెస్‌లు బహుమానంగా ఇవ్వడం ఒక సంప్రదాయం. మెడ చుట్టూ ఉండే సన్నని చోకర్లకి నక్షత్రాల ఆకారంలో వజ్రాలను పొదిగి ప్రత్యేకంగా తయారు చేస్తారు. దానికి నప్పేలా నక్షత్రాకారంలో జుంకాలు, పెండెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. క్రిస్మస్ ప్రత్యేక దుస్తులకు నప్పేలా రకరకాల నమూనాల్లో వీటిని తయారు చేస్తున్నారు. వెస్ట్రన్వేర్పైనే కాకుండా చీరకట్టుపైనా ధరించే విధంగా వివిధ లోహాలతో చేసిన పెండెంట్లు, సిలువలు, గొలుసులు కూడా వచ్చేశాయి. చిన్నపిల్లలకు అలంకరించేందుకు చిట్టిపొట్టి శాంతా క్లాజ్ బొమ్మలు, క్రిస్మస్ ట్రీ పెండెంట్లతో కూడిన డిజైనర్ సెట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

స్ఫూర్తిగా నిలిచే వాక్యాలు
బైబిల్ వాక్యాలను, జీసస్ పేరును చెక్కిన ఉంగరాలు ఎంతో ప్రత్యేకమైనవి. వివిధ లోహాలపై అందమైన వాక్యాలు రాసిన ఈ నగలు అందంగా మెరిసిపోతూనే చేయాల్సిన పనులను, నడవడిక తీరును గుర్తుచేస్తాయి. వీటిని ధరించిన వారిని నిరంతరం నియంత్రిస్తూ, దేవుడు మనవెంటే, మనలోనే ఉన్నాడని ధైర్యాన్ని ఇస్తాయి. అందుకే చాలామంది తమ పేర్లకన్నా ఎక్కువగా దేవుడి పేరును, బోధనలను నగలపై ముద్రించుకుంటారు.

బంగారమే కానక్కర్లేదు..
బంగారం, వెండి వంటి లోహాలతోపాటు ప్లాస్టిక్, రబ్బర్‌తో రూపొందించిన క్రిస్మస్ నగలు అందుబాటులో ఉన్నాయి. ఖరీదైన నగలు కొనలేనివారు వీటిని ధరించి మెరిసిపోవచ్చు. క్రిస్టల్స్, గిల్ట్, వన్‌గ్రామ్ గోల్డ్ వంటి నగల్లోనూ ఈ ప్రత్యేక డిజైన్లు ఉన్నాయి. తేలికగా, వైవిధ్యంగా ఉండే ఈ నగలను ధరించి క్రిస్మస్ సందడిని రెట్టింపు చేసుకోండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Christmas Special | ఈ క్రిస్మస్కు ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లను ట్రై చేయండి
Fashion | పార్టీలు, ఫంక్షన్ల కోసం సింపుల్ అండ్ ట్రెండీ డిజైన్స్
అందం.. అధికారానికి చిహ్నం.. అరబ్ నగలు.. హైదరాబాద్‌కి ప్రత్యేక అనుబంధం
netted fabric | సంప్రదాయంతో పాటు గ్రాండ్ లుక్.. ఇప్పుడు నెట్టెడ్ ఫ్యాబ్రిక్దే హవా..
bandhani fashion | ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు ఇదే ట్రెండ్.. స్కర్ట్స్, లెహంగా అన్ని వీటితోనే..
fashion | రొటీన్‌కు భిన్నంగా మెరిపిస్తున్న మెటాలిక్ ఫ్యాషన్
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

