e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home జిందగీ Cabbage tikki | రుచిక‌ర‌మైన క్యాబేజి టిక్కీ

Cabbage tikki | రుచిక‌ర‌మైన క్యాబేజి టిక్కీ

కావలసిన పదార్థాలు
క్యాబేజి: రెండు కప్పులు, ఉప్మా రవ్వ: పావు కప్పు, కార్న్‌ఫ్లోర్‌: రెండు టేబుల్‌ స్పూన్లు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: రెండు రెబ్బలు, కొత్తిమీర: కొద్దిగా, కారం: ఒక టీస్పూన్‌, గరం మసాలా: పావు టీస్పూన్‌, మిరియాల పొడి: పావు టీస్పూన్‌, ఉప్పు: తగినంత.

తయారీ విధానం
ముందుగా, క్యాబేజీని వీలైనంత చిన్నగా తరిగి బాగా కడిగి, నీళ్ళన్నీ పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో క్యాబేజీ తురుము, రవ్వ, కార్న్‌ఫ్లోర్‌, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కారం, గరం మసాలా, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి అవసరమైతే కొన్ని నీళ్ళు చల్లుకుని బాగా కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి నాలుగు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక క్యాబేజీ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని టిక్కీల్లా ఒత్తుకుని రెండు వైపులా కాల్చుకుంటే క్యాబేజీ టిక్కీలు రెడీ.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana