సోషల్ మీడియా వేదికగా తన జీవితానికి సంబంధించిన సంగతులను పంచుకుంటూ ఉంటుంది బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి కుంద్రా. రెండో బిడ్డ కోసం తాను ఎంతగా, ఎందుకు ఆరాటపడిందన్న సంగతుల్ని పంచుకుంది. ‘నా కొడుకు వియాన్కు తప్పకుండా తోబుట్టువు ఉండాలని నేను కోరుకునే దాన్ని. మేం కూడా ఇద్దరం. తోబుట్టువు విలువ నాకు తెలుసు.
అందుకే రెండో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేశాం. అయితే నాకు అప్లా (యాంటీ ఫాస్పోలిపిడ్ యాంటీబాడీస్) అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చింది. నేను నెల తప్పగానే అది రెచ్చిపోయేది. దాని వల్ల శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతుంటాయి. అలా రెండు సార్లు అబార్షన్ అయింది.
మిషనరీ ద్వారా ఒక బిడ్డను దత్తత తీసుకునే ప్రయత్నాలు కూడా సఫలం అవలేదు. నాలుగేండ్లు దానికోసం ఎదురు చూశా. దీంతో సరోగసీకి వెళ్లాల్సొచ్చింది. మా పాప సమీషా అలా మా ఇంటికొచ్చింది.’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పిల్లలిద్దరి ముద్దు ముద్దు ఫొటోలను అభిమానులు తెగ లైక్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే.