ఏ రంగాన్ని తీసుకున్నా సరే ఉద్యోగులు రోజులో 8 నుంచి 10 గంటల పాటు ఆఫీసుల్లోనే గడపాల్సి ఉంటుంది. దీంతో పని ప్రదేశాల్లో భోజనం, స్నాక్స్ తినడం తప్పనిసరి వ్యవహారం. చాలామంది ఆహార పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లోనే తీసుకువెళ్తుంటారు. ఆరోగ్యానికి ఇదంత మంచిది కాదు.
ప్రత్యామ్నాయంగా గాజు లంచ్ బాక్సులను ఎంచుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.