HomeZindagiBeauty Experts Say That The Oil Extracted From The Roots Of The Turmeric Plant Also Enhances Beauty
మేనికి.. పసుపు నూనె
ఆరోగ్యంతోపాటు అందాన్ని కాపాడటంలో ‘పసుపు’ ముందుంటుంది. అయితే, పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన నూనె కూడా అందాన్ని అందలం ఎక్కిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యంతోపాటు అందాన్ని కాపాడటంలో ‘పసుపు’ ముందుంటుంది. అయితే, పసుపు మొక్క వేళ్ల నుంచి తీసిన నూనె కూడా అందాన్ని అందలం ఎక్కిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
ముఖంపై మొటిమలు, మచ్చలకు కారణమయ్యే సీబమ్ ఉత్పత్తిని క్రమబద్ధం చేయడంలో పసుపు నూనె సమర్థంగా పనిచేస్తుంది. ఫలితంగా మొటిమల బెడద తగ్గుతుంది. పసుపు నూనెలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు.. చర్మానికి కావాల్సిన తేమను అందించి, పొడి చర్మం సమస్యను దూరం చేస్తాయి. ఇక ముఖంపై ముడతలు, గీతలను నివారించడం వల్ల మేనిఛాయ మరింత మెరుగవుతుంది.
పసుపు నూనెలో యాంటి మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఉండే ‘కర్కుమిన్’ అనే సమ్మేళనం.. చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. మొటిమలు, తామర, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలనూ తగ్గిస్తుంది. ముఖంపై ఏర్పడే కొన్ని రకాల మచ్చలనూ నివారిస్తుంది.
ఇందులోని యాంటి ఆక్సిడెంట్స్.. ఫ్రీరాడికల్స్‌ను సమతుల్యం చేస్తాయి. చర్మకణాలు దెబ్బతినకుండా కాపాడి.. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింప జేస్తాయి. చర్మంపై మడతలు, మచ్చల్ని దూరం చేస్తాయి. దాంతో.. చర్మం ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంది.