స్కిన్నీ జీన్స్, టైట్ టాప్స్ లాంటి టైట్ దుస్తులతో కాస్త జాగ్రత్త. ఇవి శరీరంలో రక్త ప్రవాహాన్ని దెబ్బతీస్తాయి. వీటిని రెగ్యులర్‌గా ధరిస్తే.. దీర్ఘకాలంలో రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్తప్రసరణ సజావుగా సాగపోవడం వల్ల నడుము, ఛాతీ కండరాల్లో తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంది. పొట్టని బాగా అదిమిపట్టి ఉంచడం వల్ల అసిడిటీ కూడా రావొచ్చు. ఫిట్‌గా, స్లిమ్‌గా కనిపించాలని వేసుకునే స్కిన్‌టైట్ దుస్తుల వల్ల కలిగే అనర్థాలు ఇవి. అందుకే, వదులుగా, మీకు సౌకర్యవంతంగా ఉండే దుస్తులనే ధరించడానికి ప్రాధాన్యం ఇవ్వండి. స్కిన్‌టైట్ ఫ్యాషన్ అరుదుగా పాటిస్తేనే అందం, ఆరోగ్యం.