Dry Dates | ఎండలు ముదురుతున్నాయి. ముందస్తుగానే ఆరోగ్య సంరక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేడి శరీరం ఉండేవారు రోజంతా హైడ్రేటెడ్‌గా ఉండాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. పోషకాలు అధికంగా లభించే పదార్థాలను ఆశ్రయించాలి. అలాంటివాటిలో ఎండు ఖర్జూర, పెరుగు ఎంతో మేలు చేస్తాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.