యాదాద్రి: సోమవారం నుంచి పాతగుట్టలో యాదాద్రి అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు ఆనవాయితీగా అధ్యయనోత్సవాలు జరుగుతాయని తెలిసిందే. ఈ అధ్యయనోత్సవాలు ముగిసిన తర్వాత వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 11 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.