సోమవారం 01 మార్చి 2021
Yadadri - Dec 22, 2020 , 00:05:54

వైభవంగా నిత్యపూజలు

వైభవంగా నిత్యపూజలు

పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు

శ్రీవారి ఖజానాకు రూ.15,55,016 ఆదాయం

ఆలేరు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం అర్చకులు నిత్యపూజలు వైభవంగా చేపట్టారు.  స్వామివారిని పంచామృతాలతో అభిషేకించి, పట్టువస్ర్తాలను ధరింపజేసి అర్చన నిర్వహించారు. మండపంలో ఉత్సవమూర్తులకు తులసీదళాలతో అర్చించారు. సుదర్శన నారసింహహోమం, నిత్యకల్యాణం వేడుకులు చేపట్టారు. సాయంత్రం బాలాలయ మండపంలో  స్వామి అమ్మవార్లకు ప్రత్యేక సేవ నిర్వహించారు.  సత్యనారాయణస్వామి పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.  పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి బాలాలయంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, బిల్వార్చన వైభవంగా జరిపారు. ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకించి శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడిని విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చన చేశారు. పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. 

 రూ. 15,55,016 ఆదాయం

యాదాద్రి  లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 15,55,016 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ. 1,78,246, రూ. 100 దర్శనాల ద్వారా రూ. 16,000, రూ. 150 దర్శనాల ద్వారా రూ. 90,000, ప్రచారశాఖ ద్వారా రూ. 6,000,  క్యాలెండర్ల ద్వారా రూ. 20,000, వ్రతాల ద్వారా రూ. 66,000, కల్యాణ కట్ట ద్వారా రూ. 21,800, ప్రసాదవిక్రయాల ద్వారా రూ. 5,39,580, శాశ్వత పూజల ద్వారా రూ. 1,116, వాహనపూజల ద్వారా రూ. 15,400, టోల్‌గేట్‌ ద్వారా రూ. 1,140, అన్నదాన విరాళం ద్వారా రూ. 14,717, ఇతర విభాగాలు రూ. 5,85,017లతో కలిపి రూ. 15,55,016 ఆదా యం వచ్చినట్లు  ఆమె తెలిపారు. 

VIDEOS

logo