రైతుబంధుకు మరో చాన్స్

కొత్త పాసు పుస్తకాలు పొందిన రైతులకూ సర్కారు భరోసా
వానకాలంలో 2,01,069 రైతులకు రూ.300 కోట్లకు పైగా సాయం
యాసంగికి అదనంగా 7,683 మంది రైతులకు లబ్ధి
వివరాలను అందజేసేందుకు ఈ నెల 21 వరకు అవకాశం
ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్న అధికారులు
యాసంగి సాగుకు ‘రైతుబంధు’ సాయాన్ని ఈ నెల 27 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఆరో విడుతలో మరికొంత మందికి పెట్టుబడి సాయాన్ని అందించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. కొత్తగా పాసుపుస్తకాలు పొందిన వారు, పాసుపుస్తకాలు ఉన్నా రైతుబంధు రానివారు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 21వరకు గడువు ఇచ్చింది. జిల్లాలో ఆర్వోఎఫ్ఆర్ భూములకు పాసు పుస్తకాలు పొందిన రైతులకు కూడా ఈసారి రైతుబంధు సాయాన్ని అందిస్తున్నారు. ఈ మేరకు రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్నారు.
- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి,
నమస్తే తెలంగాణ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:
రైతులపై పంటల సాగు భారం పడకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తు న్నది. పెట్టుబడి కింద రైతులకు ఎకరాకు ఆరంభంలో రూ.4వేలు ఉన్న పెట్టుబడి సాయాన్ని రూ.5 వేలకు పెం చింది. రెండేండ్లుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో సాయం మొత్తాన్ని ప్రభుత్వం జమచేస్తూ వస్తున్నది. జిల్లా వ్యా ప్తంగా 2,23,890 మంది రైతులుండగా గత వానకాలంలో 2,01,069 మంది రైతులకు రూ.300,20,48, 412 మేర పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇటీవల మరో 7,683 మం ది రైతులకు కొత్త పాసుపుస్తకాలను ప్రభుత్వం జారీచేసింది. ఇప్పటి వర కు వీరంతా బ్యాంకు ఖాతాల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయలేదు.
ప్రభుత్వం కొత్తవారికి కూడా అవకాశం కల్పించడంతో ఇప్పటివరకు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోని రైతులు అన్ని మండల కేం ద్రాల్లోని ఏఈవోల వద్దకెళ్లి పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్తోపాటు బ్యాంకు ఖాతా నెంబర్లను సమర్పిస్తున్నారు. ఆర్వోఎఫ్ఆర్ భూములు కలిగిన రైతులు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పొందిన పాసుపుస్తకంతోపాటు బ్యాంకు ఖాతా వివరాలను అందజేయాల్సి ఉంటుంది. విజయా బ్యాంకు ఇతర బ్యాంకుల్లో విలీనమైనందున మారిన అకౌంట్ల నంబర్లతోపాటు, ఐఎఫ్ఎస్సీ నంబర్ల ను సమర్పించాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. రైతుబంధుకు కొత్తగా దరఖాస్తు చేసే వారంతా ఈనెల 21 వరకు వివరాలను అందజేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
ఐదు విడతల్లో అందిన పెట్టుబడి సాయం
జిల్లాలోని రైతాంగానికి ప్రభుత్వం ఇప్పటివరకు ఐదు విడతల్లో పెట్టుబడి సాయాన్ని అందజేసింది. 2018 వా నకాలం సాగుకు 1,71,882 మంది రైతులకు రూ.203. 42 కోట్లను ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందజేసింది. 2018 యాసంగిలో 1,62,858 మంది రైతులకు రూ.198.5 కోట్లను ఖాతాల్లో జమ చేసింది. 2019 వానకాలంలో 1,72,343 మంది రైతులకు రూ.216. 83 కోట్లను ప్రభుత్వం అందజేయగా, 2019 యాసంగిలో 1,25,205 మంది రైతులకు రూ.127.85 కోట్లను అందించింది.
2020 వానకాలంలో 2,01,069 మంది రైతులకు రూ.300.20కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది.
సంతోషంలో గిరిజన కుటుంబాలు
సంస్థాన్ నారాయణపురం : ఆర్వోఎఫ్ఆర్ భూములకు పట్టాలు కలిగిన రైతులకు రైతుబంధును ప్రభుత్వం వర్తింపజేయనుండడం తో జిల్లాలో వేలాది మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా గిరిజనులు అత్యధికంగా ఉన్న సంస్థాన్ నారాయణపురం మండలంలోని గిరిజనులు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. రాచకొండ ప్రాంతంలోని ఐదుదోనాల తండా గిరిజన రైతులు అటవీ హక్కు చట్టం కింద పట్టాలు పొందినప్పటికీ ప్రభుత్వం ఐదు విడతల్లో ఇచ్చిన రైతుబంధు పథకానికి నోచుకోలేకపోయారు. ఈ క్రమంలో ఇక్కడి గిరిజనులు గతంలో ఎన్నోమార్లు ఆందోళనలు సైతం నిర్వహించారు. ప్రస్తుతం వీరికి కూడా రైతుబంధు సాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గిరిజన సంక్షేమశాఖ అధికారి మంగ్లానాయక్ శనివారం రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో కలిసి ఐదుదోనాల తండాను సందర్శించి గిరిజన రైతుల భూములను పరిశీలించారు. జియోట్యాగింగ్ ద్వారా గిరిజన రైతులకు సంబంధించిన భూముల హద్దులను తేల్చి ఎంతమందికి పట్టాలు ఉన్నాయి? ఎంతమంది రైతులు సాగు చేసుకుంటున్నారో సర్వే ద్వారా నిర్ణయించి గిరిజన రైతులకు రైతుబంధు సాయం అందేలా చర్యలు తీసుకుంటానని మంగ్లానాయక్ తెలిపారు. ఎన్నోఏళ్లుగా చేస్తున్న పోరాటం ఫలించి రైతుబంధు సాయం అందనుండడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు. తండాను సందర్శించిన వారిలో తహసీల్దార్ బ్రహ్మయ్య, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ రాములు, సర్వేయర్ కాశయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- వ్యవసాయం చేయకపోతే తినడం మానేయాలి: శ్రీకారం రైటర్
- ధోనీ రికార్డును సమం చేసిన కోహ్లీ
- పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతమే
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5