సోమవారం 01 మార్చి 2021
Yadadri - Oct 20, 2020 , 05:30:43

తప్పిన పెనుముప్పు..

 తప్పిన పెనుముప్పు..

  • వరద నీరు పోటెత్తినా తెగని చౌటుప్పల్‌ పెద్దచెరువు కట్ట
  • కట్ట ఏర్పాటు చేయించిన మాజీ ఎమ్మెల్యే  కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

చౌటుప్పల్‌: చౌటుప్పల్‌ ప్రాంత వాసులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు చౌటుప్పల్‌ లోతట్టు ప్రాంతాలతో పాటు చాలా కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకొని భారీగా ఆస్తినష్టం జరిగే అవకాశం ఉండేది. కానీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముందు చూపుతో పెద్ద ప్రమాదం నుంచి ఈప్రాంత వాసు లు బయటపడ్డారని చెప్పవచ్చు. చౌటుప్పల్‌ పెద్దచెరువును మినీట్యాంక్‌ బండ్‌గా మార్చి ఆధునీకరించాలని సీఎం కేసీఆర్‌ను అప్పట్లో ఒప్పించి రూ. 3. 50 కోట్లు రాబట్టారు. అంతేకాకుండా రూ. 1.50 కోట్లతో ఇప్పటికే పెద్దచెరువులో పెద్ద ఎత్తున అభివృ ద్ధి పనులు చేయించారు. అప్పట్లో చాలా నాసిరకం గా ఉన్న పెద్దచెరువు కట్టను పకడ్బందీగా ఏర్పాటు చేయించారు. గత 20ఏండ్లుగా వర్షాలు పడకపోవడంతో మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు బీసీకాలనీ, బస్టాండ్‌ ఏరియా, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పక్కన పెద్ద ఎత్తున ఇండ్లు వెలిశాయి. ఈప్రాంతాల్లో వేలాది మంది నివాసం ఉంటున్నారు. రెండు, మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు లక్కారం చెరువు నిండుకుంది. ఈ చెరు వు నుంచి వచ్చిన  వరదతో  చౌటప్పల్‌ పెద్దచెరువునిండింది. ఒకవైపు వర్షంపడి చెరువు నిండుతుందన్న సంతోషం..మరోపక్క కురుస్తున్న వర్షాలకు చెరువుకట్ట  తెగుతుందేమోనన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడిపారు. పెద్ద వర్షం వచ్చి వరద పోటెత్తినా చౌటుప్పల్‌ పెద్దచెరువుకట్ట తెగిపోకపోవడంతో ప్రజలు ఊపరి పీల్చుకున్నారు. 

 పకడ్బందీగా కట్టపనులు చేయించా 

ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులన్నీ అలుగుపారాయి. ముఖ్యంగా 15 ఏండ్ల తర్వాత లక్కారం, చౌటుప్పల్‌ పెద్దచెరువులు నిండుకున్నాయి. గతంలో పెద్ద చెరువు పరిశీలనకు వెళ్లినప్పుడు పెద్ద వర్షం పడితే ఈ ప్రాంత వాసుల పరిస్థితి ఎంటి అని ఆలోచించా. చెరువుకట్ట తెగితే చౌటుప్పల్‌ ఆగమవుతుందని పసిగట్టి..  చౌటుప్పల్‌ పెద్దచెరువును మినీట్యాంక్‌ బండ్‌గా మార్చాలని సీఎం కేసీఆర్‌ని కోరా. ఈక్రమంలో చెరువుకట్టను పకడ్బందీగా ఏర్పాటు చేయించా.  వరద పోటెత్తినా చెరువుకట్టతెగలేదు. 

 -కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే 

VIDEOS

తాజావార్తలు


logo