శనివారం 16 జనవరి 2021
Yadadri - Oct 20, 2020 , 05:30:43

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

రామన్నపేట: వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ఎంపీటీసీ వేమవరపు సుధీర్‌బాబు డిమాండ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించారు. అనంతరం తహసీల్దార్‌ శ్రీనివాసకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వనం హర్షిని, జమీరోద్దిన్‌, అల్లయ్య, మల్లేశం, శివ, మహేశ్‌, స్వామి పాల్గొన్నారు.

అడ్డగూడూరులో..

అడ్డగూడూరు : వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు సోమవారం ఆర్‌ఐకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వారిని వెంటనే ఆదుకోవాలని కోరారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఆర్‌ఐకి వినతిపత్రం అంజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు లింగయ్య, నాయకులు బొమ్మగాని లక్ష్మయ్య, నిరంజన్‌రెడ్డి, రాచకొండ రమేశ్‌, సురేశ్‌, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.