నల్లబెల్లి/దుగ్గొండి, మే 15: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న భరోసా ఇచ్చారు. మండలకేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నదన్నారు. కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, సీఈవో నాగెల్లి మొగిలి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, సర్పంచ్ ఎన్ రాజారాం, ఎంపీడీవో విజయ్‌కుమార్, కొత్తపెల్లి కోటిలింగాచారి, జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రామస్వామి, రేలకుంట సర్పంచ్ సిద్దూరి రత్నాకర్‌రావు, ఎంపీటీసీ జన్ను జయరావ్, పీఏసీఎస్ డైరెక్టర్ బత్తిని మహేశ్, నాయకుడు పాండవుల రాంబాబు పాల్గొన్నారు. అలాగే, దుగ్గొండి మండలంలోని తిమ్మంపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాచినపల్లి పీఏసీఎస్ చైర్మన్ సుకినె రాజేశ్వర్‌రావు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. కార్యక్రమంలో తిమ్మంపేట సర్పంచ్ మోడెం విద్యాసాగర్‌గౌడ్, ఉపసర్పంచ్ కత్తి యాకాంద్రం, ఎంపీటీసీ మాలోత్ చంద్రనాయక్, డైరెక్టర్లు కోమాండ్ల సూరారెడ్డి, దోనపాటి జనార్దన్‌రెడ్డి, అజ్మీరా సాంబయ్య, నరహరి సునీత, ఎలకంటి కుమారస్వామి, నలగొండ మొగిలి, దోనపాటి సాంబారెడ్డి, సీఈవో ముల్క రాజయ్య, సోమ ఓంకార్, సుధాకర్, రజినికుమార్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి అన్నారు. అమీనాబాద్ సొసైటీ పరిధిలోని అమీనాబాద్, తిమ్మరాయిన్పహాడ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. అలాగే, చెన్నారావుపేట సహకార సంఘం పరిధిలోని పాపయ్యపేటలో కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ ముద్దసాని సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ వంశీ ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ పెండ్లి మల్లయ్య, ఎంపీటీసీ కడారి సునీతా సాయిలు, సర్పంచ్ సిద్దన రమేశ్, డైరెక్టర్, ఆర్బీఎస్ అమీనాబాద్ గ్రామ కన్వీనర్ అమ్మ రాజేశ్, నాయకుడు కొండవీటి ప్రదీప్, ఉప సర్పంచ్ శౌరి రాజు, వ్యవసాయాధికారులు సూర్యనారాయణ, రఘుపతి, సంపత్ పాల్గొన్నారు. అలాగే, మండలంలోని పాపయ్యపేటలో సెర్ప్ ఆధ్వర్యంలో మక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సరిత సోమవారం ప్రారంభించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మీ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రమాదేవి, ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, సీసీ సుజాత, అక్షయ రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య కార్యవర్గ సభ్యులు, పాపయ్యపేట గ్రామైక్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.