రాయపర్తి, నవంబర్ 14: క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమని వరంగల్, హనుమకొండ జిల్లాల డీసీవోలు పోతుల అపర్ణ, దాసరి ఉమామహేశ్వరి అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని సాంఘి క సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో తెలంగాణ రాష్ట్ర సోష ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొ సైటీ సారథ్యంలో నిర్వహిచిన 10వ జోనల్ లెవల్ స్పోర్ట్స్ మీట్-2024-25 క్రీడా పోటీలు గురువారం ముగిశా యి. ముఖ్య అతిథులుగా వారు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
అండర్-14 వ్యక్తిగత చాంపియన్షిప్లో టీ అంజలి (నర్సింహులపేట గురుకులం), అం డర్-17 విభాగంలో డీ వర్షిణీతేజ, అండర్-19 విభాగంలో లయశ్రీ (రాయపర్తి గురుకులం), అండర్-14 గేమ్స్ చాంపియన్షిప్లో హసన్పర్తి గురుకులం, అండర్-17 విభాగంలో మడికొండ గురుకులం, అండర్-19 విభాగంలో పరకాల గురుకులం, అండర్-14 గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఓవరాల్ చాంపియన్షిప్లో నర్సింహులపేట గురుకులం, అండర్-17, అండర్-19 విభాగాల్లో రాయపర్తి గురుకులాల క్రీడాకారిణులు విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా క్రీడాకారిణుల మార్చ్ఫాస్ట్, క్రీడా వందనాలు, విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గురుకులాల ప్రిన్సిపాళ్లు సముద్రాల సరిత, రాయరాకుల సమ్మ య్య, పీడీలు కళమ్మ, ప్రభావతి, గురుకులాల సిబ్బంది అలుగు రమ్యసుధ, కల్పన, లీల, జ్యోతి, వేణు, సృజన, కల్పన పాల్గొన్నారు.