నల్లబెల్లి, మార్చి 23 : యువత భగత్ సింగ్ అడుగుజాడల్లో పయనించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు బీసీ హక్కుల సాధన సమితి నల్లబెల్లి మండల కో కన్వీనర్ మేడిపల్లి రాజు ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94 వ వర్ధంతి వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ దేశంలోని ప్రజలకు వాక్ స్వాతంత్రమే కాకుండా, ఆర్థిక సామాజిక రాజకీయ స్వాతంత్ర్యంతో కూడిన సమానత్వం రావాలని భగత్ సింగ్ కోరుకున్నాడన్నారు. ఆయన రచనలు నేటి యువతరం అధ్యయనం చేయాలని పేర్కొన్నారు.
స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న రాజగురు, సుఖదేవ్ లాంటి యువతరాన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత అవినీతి రహితమైన రాజకీయాల్లోకి రావాలన్నారు.
రాజ్యాధికారమే లక్ష్యంగా రాబోయే రోజుల్లో ఉచిత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం గడపగడపకు వెళ్తామన్నారు. బీసీ కులాల యువతకు బీసీ హక్కుల సాధన సమితి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం బీసీల కోసం దేశవ్యాప్త కులగణన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైనాల వీరాస్వామి సామాల సునిల్,పరికి కోర్నేలు జక్కుల రవి,భూస కుమారస్వామి, మేడిపల్లి లక్ష్మణ్ ఐలయ్య, దిండు బాబు,మనుగొండ బాబు, కనకం సాల్మన్, కోడూరు సదానందం,నానెబోయిన నరేష్,బొడిగె దిలీప్,గొర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు