జనగామ, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : నమ్మి వెంట వచ్చిన స్నేహితురాలిపై 10 మంది యువకులు సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో జూన్ మాసంలో జరిగినప్పటికీ ఇటీవల బాధితురాలి సమీప బంధువు ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పండరిచేతన్ నితిన్ నిందితులను ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు.
జనగామ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతిని ఓ యువకుడు స్నేహం, ప్రేమ పేరుతో నమ్మించి కారులో ఎకించుకొని జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డు టీ-వరల్డ్ వెనకాల ఉన్న ఒక రూంకు తీసుకెళ్లాడు. అక్కడ 10 మంది కలిసి ఒకరి తర్వాత ఒకరు సామూహికంగా లైంగికదాడి చేశారు. ఆ తర్వాత కూడా ఓ యువకుడు బాధిత యువతిని ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి గోవాకు తీసుకెళ్లి అక్కడ కూడా లైంగికదాడికి తెగబడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి చిన్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జనగామ బాలాజీనగర్‌కు చెందిన మహ్మద్ ఓవైసీ, ఎండీ అబ్దుల్ ఖయ్యూం,
గుండ సాయి చరణ్‌రెడ్డి, గీతానగర్‌కు చెందిన ముత్యాల పవన్‌కుమార్, బాణాపురానికి చెందిన బొద్దుల శివకుమార్, లిగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన సుకల అలియాస్ పులి రవి, జనగామ మండలం పసరమడ్లకు జిట్టె సంజయ్, కుర్మవాడకు చెందిన పుస్తకాల సాయితేజ, హనుమాన్ స్ట్రీట్‌కు చెందిన ముత్తాడి సుమంత్‌రెడ్డి, ఓరుగంటి సాయిరాంను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని ఏసీపీ తెలిపారు. నిందితుల నుంచి 3 సెల్ ఫోన్లు, టయోటా కారు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన జనగామ అర్బన్ సీఐ దామోదర్‌రెడ్డి, ఎస్ఐలు భరత్, చెన్నకేశవులు, కానిస్టేబుళ్లను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు.