వెల్దండ ఏప్రిల్ 23: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని పోచమ్మ గడ్డ తండాకు చెందిన వర్త్యావత్ యశ్వంత్ నాయక్ గత సంవత్సరం యూపీఎస్ ఫలితాలలో 627 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. పట్టు వదలకుండా మరోసారి యూపీఎస్సీ పరీక్ష రాసి జాతీయస్థాయిలో 432 మెరుగైన ర్యాంకు సాధించాడు. యశ్వంత్ ప్రస్తుతం హైదరాబాదులోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నాడు.
పట్టు వదలకుండా మరోసారి యూపీఎస్సీ పరీక్ష రాసి మెరుగైన ర్యాంకు సాధించాడు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని అన్నారు. యశ్వంత్ తండ్రి ఉమాపతి ఎస్బీఐలో ఏజీఎంగా హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. యశ్వంత్‌కు గ్రామస్తులు పలువురు అభినందనలు తెలియజేశారు.