నర్సంపేట రూరల్, మే 4: రైతు సంక్షేమమే టీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మాదన్నపేట, భాంజీపేటలో నర్సంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం పెద్ది ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను కుట్రపూరితంగా ఇబ్బందులకు గురి చేసిందని ధ్వజమెత్తారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షాన నిలబడి ధాన్యం కొనుగోలు చేయాలని సంకల్పించి ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులపై భారం పడొద్దనే ఉద్దేశంతో మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
దళారుల చేతిలో మోసపోవద్దు
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ఉత్పత్తులను దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించాలని కోరారు. తేమ లేని, ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. క్వింటాల్‌కు ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ. 1960, సీ-గ్రేడ్‌కు రూ. 1940 మద్దతు లభిస్తున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రైతులు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, మాజీ ఎంపీపీ నల్లా మనోహర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్ నాగ నారాయణ, వైస్ చైర్మన్ మేరుగు శ్రీనివాస్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, మాదన్నపేట, భాంజీపేట, భోజ్యానాయక్‌తండా, పర్శనాయక్‌తండా, చంద్రయ్యపల్లి సర్పంచ్‌లు మొలుగూరి చంద్రమౌళి, పలకల పూలమ్మ, భూక్యా లలిత, బరిగెల లావణ్య, ఎంపీటీసీలు ఊడ్గుల రాంబాబు, పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, అజ్మీరా వీరన్న, పీఏసీఎస్ డైరెక్టర్లు కోమాండ్ల రాజిరెడ్డి, దర్గూరి తిరుపతి, పెసరు సాంబరాజ్యం, మిట్టగడుపుల సుప్రజ, టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మచ్చిక నర్సయ్యగౌడ్, మండల ముఖ్య నాయకులు మోతె పద్మనాభరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, కడారి కుమారస్వామి, ఆనందం, జగన్మోహన్రావు, భూక్యా వీరూనాయక్, వల్లాల కరుణాకర్‌గౌడ్, కట్ల సుదర్శన్‌రెడ్డి, సీఈవో మధు, ఏఈవో మెండు అశోక్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు.
వధూవరులకు ఎమ్మెల్యే పెద్ది ఆశీర్వాదం
ఖానాపురం: మండలంలోని ధర్మారావుపేటకు చెందిన పూజారి రజిత-కుమార్ దంపతుల కుమార్తె దేవీశ్రీ వివాహం బుధవారం జరిగింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ వెన్ను శ్రుతి, పూర్ణచందర్, సమ్మయ్య, నడిపెల్లి రాజేశ్వర్‌రావు, మేడి సమ్మయ్య పాల్గొన్నారు.