హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 25 : ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్, కరాటే కుంగ్ ఫూ, టైక్వాండో ఛాంపియన్షిప్ 2025 పోటీలలో యజుర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రోలింగ్ షీల్డ్సాధించారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ పోటీల్లో హనుమకొండ జిల్లా నుంచి వివిధ స్కూల్ విద్యార్థులు పాల్గొనగా యజూర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి వివిధ విభాగాలలో పథకాలను సాధించారు. తమ కృషి, శిక్షణ, ప్రతిభతో మెరిసిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి రోలింగ్ షీల్డ్ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఏకైక పాఠశాలగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ ఛాంపియన్షిప్ పోటీలలో యజుర్ పబ్లిక్ స్కూల్ నుంచి మొత్తం 39 మంది విద్యార్థులు పాల్గొనగా ఇందులో 26 మంది స్వర్ణ పథకాలు, 10 మంది రజత పథకాలు, ముగ్గురు కాంస్య పథకాలు సాధించి ప్రతిభను చాటారు. ఈ విజయంతో యజూర్ పబ్లిక్ స్కూల్ మరో అంతర్జాతీయ స్థాయిలో కీర్తి పొందిందని ఈ గొప్ప విజయంలో విద్యార్థులకు శిక్షణ అందించిన కోచ్ క్రాంతికుమార్‌ను పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జలీల్ అహ్మద్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.