ఖిలావరంగల్ : చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోటలోని కీర్తి తోరణాల మధ్య అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(Womens Day) ఘనంగా నిర్వహించారు. కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకులకు కోటలోని 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమను ముఖ్య అతిధులుగా ఆహ్వానించి సన్మానించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ బైరబోయిన ఉమ మాట్లాడుతూ రాణి రుద్రమాదేవి పరిపాలించిన ఈ గడ్డపై మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రపురావస్తు శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్, హెచ్ఆర్ దేశాయ్, ఏఎస్ఐ గోల్కొండ, సీఏ మల్లేశం, కేయూ కౌన్సిల్ సభ్యురాలు అనితారెడ్డి, కాకతీయు డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పీ రోహిణి, తదితరులు పాల్గొన్నారు.