హనుమకొండ రస్తా : హనుమకొండలో టెన్నిస్( Tennis ) క్రీడాఅభివృద్ధికి కృషి చేస్తానని హనుమకొండ జిల్లా క్రీడాభివృద్ధికారి గుగులోతు అశోక్‌కుమార్( DSEO Ashok Kumar ) , హనుమకొండ ఏసీపీ నర్సింహరావు అన్నారు. శనివారం హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్‌ఎస్‌లోని టెన్నిస్ గ్రౌండ్లో ఇన్విటేషన్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేఎన్ స్టేడియంలోని టెన్నిస్ కోర్టులో ఫ్లడ్‌లైట్లు, క్లబ్కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హనుమకొండలో విస్తరిస్తున్న టెన్నిస్ క్రీడకు కావలసిన మౌలిక వసతుల ఏర్పాటుకు సంబంధిత అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నల్లా సురేందర్‌రెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి మాట్లాడుతూ జిల్లాలోని ఔత్సాహిక క్రీడాకారులను వెలుగులో తీసుకొచ్చేందుకు హనుమకొండలో ప్రతినెల ఒక టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు.
హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ పాట్రన్ కే.రవిచంద్ర మాట్లాడుతూ హనుమకొండ టెన్నిస్ కోర్టులో మౌలిక వస్తువులకు ఆర్థికసాయం అందజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలో ప్రథమ బహుమతి నాగయ్య(ఏసీపీ), శ్రీధర్(ఆర్ఐ) జోడి ప్రథమస్థానంలో నిలవగా, రడం శ్రీనివాస్, తిప్పాని సాత్విక్ జంట ద్వితీయ స్థానంలో నిలిచారు. హనుమకొండ టెన్నిస్ కోశాధికారి సిరికొండ సుదర్శన్, ఉపాధ్యక్షుడు వెంకట్‌నారాయణ, మల్లారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పెరుమాండ్ల వెంకట్, వినీల్, శివరాజ్ పాల్గొన్నారు.