వరంగల్ లీగల్ : ఆస్తి తగాదాలతో తన ఇద్దరు కుమారులతో కలసి భర్తను రోకలి బండతో కొట్టి హత్య ( Murder Case ) చేసిన భార్యకు, ఇద్దరు కుమారులకు జనగామ జిల్లాకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష (Life Imprisonment ) విధిస్తూ తీర్పు వెలువరించింది. బూర్గుల ప్రభాకర్, పూలమ్మ వివాహం చేసుకుని వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె జన్మించారు. కొన్ని సంవత్సరాల తరువాత మనస్పర్ధాలు రావడంతో గత 13 సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారు.
కుమార్తె పెళ్లి , ఆస్తి విషయంలో తరుచు దంపతుల మధ్య గొడవలు జరుగుతుండగా 2017లో సెప్టెంబర్ 9వ తేదిన భార్య పూలమ్మ, కుమారులు బూర్గుల మురళి, బూర్గుల శ్రీకాంత్ ముగ్గురు కలిసి ప్రభాకర్‌ను రోకలి బండతో కొట్టి అతి దారుణం హత్య చేశారు.మృతుడి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
సరైన సాక్ష్యాధారాలతో ముగ్గురు నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేయడంతో ఇరువురి వాదనలు పూర్తయిన తరువాత జనగామ జిల్లా సెషన్స్ జడ్జ్ బి. ప్రతిమ ( Session Judge Pratima ) ముగ్గురు నిందితులకి జీవిత ఖైదు , రూ.1000 జరిమానా విధిస్తూ తుది తీర్పును వెల్లడించారు.