జఫర్‌గఢ్, సెప్టెంబర్ 27 : సీఎం కేసీఆర్ తోనే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు సాధ్యమని స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జఫ ర్గఢ్లో బుధవారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి సీనియర్ నాయకులు కుల్లా మోహ న్‌రావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా కడియం హాజరై మాటాడారు. దేశంలో ఏ రాష్ట్రం లో అమలు కాని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన పరిపాలనా దక్షతతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2014, 2018 లో రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేసిన కీర్తి దేశంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అ య్యాక రైతుల కరెంట్ కష్టాలు తీరి వ్యవసాయా న్ని పండుగలా చేసుకుంటున్నారన్నారు. అభివృ ద్ధికి నిధులు మంజూరు చేయడంలో సీఎం కేసీఆ ర్ బోళా శంకరుడని అన్నారు. 2023 డిసెంబర్ లో జరిగే ఎన్నికల్లో తనకు బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ అవ కాశం ఇచ్చారని, నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల తో ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచే అభివృద్ధికి పాటుపడుతానని శ్రీహరి తెలిపారు. జఫర్‌గఢ్ చె రువు కట్ట కింద ఉన్న రోడ్డును వడ్డెగూడెం నుండి హిమ్మత్‌నగర్ వరకు సీసీ రోడ్డు, జఫర్‌గఢ్ లోని ప్రధాన రోడ్డును వెడల్పు చేసి సెంట్రల్ లైటింగ్‌ను ఏర్పాటు చేసుకుందామన్నారు.
తీగారం నుంచి వయా సూరారం, తమ్మడపల్లి(జి), జఫర్‌గఢ్ శి వారు నల్లబండ వరకు డబుల్ రోడ్డు, వర్ధన్నపేట నుంచి జఫర్‌గఢ్, వయా కోమటిగూడెం మీదుగా జనగామకు రోడ్డు సౌకర్యానికి కృషి చేస్తానని ఆ యన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి, స్కాంల కు, కొట్లాటలకు మారుపేరని శ్రీహరి అన్నారు. అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్న దని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి మూడు లేదా నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని తెలిపా రు. బీజేపీ నాయకులు కేవలం మాటల వరకే ఉ న్నారని, చేతల్లో లేరని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొంభైకి పైగా సీట్లు సాధిస్తుందని కడియం శ్రీహరి అన్నారు. ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ సీఎంగా హాట్రిక్ సాధిస్తాడని ఆయన అన్నారు.
బీఆర్ఎస్లో 200 మంది చేరిక..
టీడీపీ మండలాధ్యక్షుడు రాపర్తి యాకయ్య ఆధ్వర్యంలో మండలంలోని టీడీపీకి చెందిన సు మారు 200 మంది కడియం సమక్షంలో బీఆర్ఎ స్లో చేరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఇల్లందు ల బేబీ, పీఏసీఎస్ చైర్మన్ తీగల కర్ణాకర్‌రావు, వైస్ చైర్మన్ మొగిలిపాక నర్సింగం, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు అన్నం బ్రహ్మారెడ్డి, ఎంపీటీసీల ఫో రం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, ఎంపీటీ సీలు జ్యోతి రజిత, ఇల్లందుల స్రవంతి, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ నజీర్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సింగారపు శ్రీధర్, కుల్లా రాజు, బీఆర్ఎస్ నాయకులు రాజేశ్ నాయక్, అ న్నెపు అశోక్, ఇల్లందుల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ గాదె పాక అయోధ్య, బొమ్మినేని పెద్దిరెడ్డి, గాదెపాక సుధాకర్‌బాబు, పెండ్లి స్వామి, జ్యోతీ యాకయ్య, ఇల్లందుల మొగిలి, ఎండీ ముజీబ్, ఎండీ దస్తగిరి, నాగరాజు, లోనే నాగేశ్వర్రావు, పిన్నింటి శ్రీనివాస్, యువరాజు, తాటికాయల చేతన్ పాల్గొన్నారు.