కరీమాబాద్, జూన్ 29: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి అన్నారు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఫోర్టురోడ్డులోని ఈద్గాలో అధ్యక్షుడు ఎంఏ జబ్బార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా వారు హాజరై ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. నగరంలోని మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈద్గా మసీదు అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ముస్లింలకు న్యాయం జరుగుతున్నదన్నారు. అనంతరం ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని అలయ్ బలయ్ తీసుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సిద్దం రాజు, సోమిశెట్టి ప్రవీణ్, ఈద్గా మసీదు అధ్యక్షుడు ఎంఏ జబ్బార్, చాంద్‌పాషా పాల్గొన్నారు.
36వ డివిజన్ చింతల్ ఈద్గాలో..
వరంగల్‌చౌరస్తా: ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ 36వ డివిజన్ చింతల్ ఈద్గాలో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాతే మైనార్టీలకు సముచితస్థానం దక్కిందన్నారు. ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఈద్గా కమిటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో మైనార్టీ డివిజన్ నాయకుడు, మాజీ ఫ్లోర్‌లీడర్ చాంద్‌పాషా, ఈద్గా కమిటీ సభ్యులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
త్యాగాలకు ప్రతీక బక్రీద్..
పోచమ్మమైదాన్: త్యాగాలకు ప్రతీక బక్రీద్ అని, అందరికీ సమానంగా ప్రయోజనాలు అందించినప్పుడే సార్థకత చేకూరుతుందని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. ఎల్బీనగర్లోని ఈద్గాలో ముస్లింలు పార్థనలు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ బక్రీద్ త్యాగానికి, భక్తికి ప్రతీకగా ఉందని, అల్లా దయవల్ల అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ అధ్యక్షుడు ఎండీ సాదిక్, ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్దుల్లా, కార్పొరేటర్లు ఎండీ ఫుర్ఖాన్, సురేశ్‌కుమార్ జోషి, బాధ్యులు షేక్ హుస్సేన్, ఎంఏ ఖాదర్, వాజీద్, ఆజంబేగ్, మౌలానా అతీఖుర్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.