తూము షటర్లు ఎత్తకుండా నిఘా ఏర్పాటు చేస్తాం
మత్స్యకారులు చెరువుల తూము షటర్లు ఎత్తకుండా నీటి పారుదల శాఖ నుంచి నిఘా ఏర్పాటు చేస్తామని ఆ శాఖ ములుగు డీఈ రవీందర్రెడ్డి అన్నారు. ఈ నెల 27న ‘నమస్తే’లో ‘చేపల కోసం చెరువు ఖాళీ’ కథనానికి నీటి పారుదల శాఖ అధికారులు స్పందించారు.
- నీటి పారుదల శాఖ డీఈ రవీందర్రెడ్డి
ములుగు, మే 29 (నమస్తే తెలంగాణ) : మత్స్యకారులు చెరువుల తూము షటర్లు ఎత్తకుండా నీటి పారుదల శాఖ నుంచి నిఘా ఏర్పాటు చేస్తామని ఆ శాఖ ములుగు డీఈ రవీందర్రెడ్డి అన్నారు. ఈ నెల 27న ‘నమస్తే’లో ‘చేపల కోసం చెరువు ఖాళీ’ కథనానికి నీటి పారుదల శాఖ అధికారులు స్పందించారు. బుధవారం డీఈ, ఏఈ లోకం చెరువు వద్దకు వచ్చి తూము, షటర్లు, చెరువును పరిశీలించారు. లోకం చెరువు ములుగు ఇరిగేషన్ డివిజన్ నంబర్-4 నిర్వహణలో ఉందని, చెరువు కింద 1,347ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడి ఉందని డీఈ తెలిపారు. యాసంగి పంటకు నీటి లభ్యతను బట్టి 150 ఎకరాలకు నీటిని విడుదల చేశామన్నారు. సీజన్ పూర్తయినందున తూము ద్వారా నీరు వెళ్లకుండా నిలిపివేశామని తెలిపారు. తూము షటర్ తుప్పు పట్టి రంధ్రం ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పైఅధికారులకు పంపించినట్లు తెలిపారు. చేపలు పోసిన కాంట్రాక్టర్ ఒక వేళ రాత్రి వేళలో దొంగతనంగా తూము షటర్ ఎత్తితే క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని రవీందర్రెడ్డి పేర్కొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

