శాయంపేట, డిసెంబర్ 15 : అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి సర్కారుకు గుణపాఠం చెప్పాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చిన చెన్నబోయిన ధనలక్ష్మిఅజయ్కుమార్, నర్సింహులపల్లిలో గోనె నాగరాజును సర్పంచ్‌లుగా గెలిపించాలని ర్యాలీ నిర్వహించి ఓటర్లను కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు నాశనమయ్యాయన్నారు.
కేసీఆర్ కంటే డబుల్ ఇస్తామంటే కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారని, ఒక్కటీ ఇయ్యకుండా మోసం చేసిందన్నారు. స్థానిక ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓటేస్తే హామీలు అమలు చేయకున్నా మళ్లీ మాకే ఓట్లేశారని ఒక్కటీ అమలు చేయరని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో స్పీకర్‌గా ఎన్నో అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని, మళ్లీ మూడేళ్లలో వచ్చేది కేసీఆర్ సర్కారే అని అ న్నారు. రామకృష్ణాపూర్ నుంచి గట్లకానిపర్తి, సూరంపేట, మీదుగా మల్లంపల్లి వరకు రోడ్డు వేయించి రవాణా మెరుగుపరుస్తానని అన్నారు.
జోకుడుగాండ్లు, మేసేటోండ్లను సర్పంచ్‌లుగా గెలిపించుకోవద్దని సూచించారు. ఓటు అంటే అశప డుడు కాదని, అందరి భవిష్యత్ అని ఓ టును బీఆర్ఎస్కే వేస్తే విలువ పెరుగుతుందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి, పథకాలు గమనించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో చూడాలన్నారు. విద్యార్థుల బాగోగులను పట్టించుకోకుండా తన స్వార్థం కోసం రూ. వందల కోట్లు దుబారా చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రా్రష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, అప్పుల్లో మాత్రం దూసుకుపోతున్నదన్నారు. రెండేళ్ల కాలంలోనే రూ. రెండు లక్షల కోట్ల అప్పు చేస్తే రానున్న రోజుల్లో రాష్ర్టాన్ని తాకట్టుపెట్టడం ఖాయమన్నారు. సర్పంచ్‌లుగా బీఆర్ఎస్ వారిని గెలిపిస్తే మళ్లీ అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడ్తాయని అన్నారు.నాయకులు గుర్రం రవీందర్, అడుప ప్రభాకర్, మిరిపెల్లి కృష్ణ తదితరులు ఉన్నారు.