Hanamakonda | ‘మా భూమిని కాపాడి మాకు న్యాయం చేయాలి’-భూ బాధితుల వేడుకోలు
Hanamakonda | 1984 లో కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని కబ్జా కోరల నుండి తమ భూమిని కాపాడి తమకు న్యాయం చేయాలని భూ బాధితులు కోరారు.
Hanamakonda | హనుమకొండ చౌరస్తా, మార్చి 27: 1984 లో కొనుగోలు చేసిన భూమిని అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని కబ్జా కోరల నుండి తమ భూమిని కాపాడి తమకు న్యాయం చేయాలని భూ బాధితులు కోరారు.
హనుమకొండ ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూ బాధితుడు చిట్టి రెడ్డి రజనీకర్ రెడ్డి మాట్లాడారు. తాము దుగ్గంపూడి జోజి రెడ్డి దగ్గర 30 మందిని కలిసి కుమార్ పెళ్లి శివారులో సర్వేనెంబర్ 126, 117 లల్లో ఎకరం మూడు గంటల భూమి కొనుగోలు చేసి 2017లో భూమి కాస్తు చేయించామని తెలిపారు.
కానీ 2017లో మాపై దాడి చేసి మమ్మల్ని చంపుతామని బెదిరించి మీ భూమి 117 కాదు 126 అని చెప్పి తమ భూమి ఎక్కడ ఉందో చూసుకోమని తమపై రంజిత్ రెడ్డి తో పాటు 20 మంది దాడి చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి నుంచి తమను ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని వాపోయారు.
ఈ విషయం గతంలో కేయూసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే అక్కడ ఎక్కడ కూడా భూమి కాగితాలు తీసుకుని రాకుండా అధికారులను తప్పుదోవ పట్టిస్తూ రంజిత్ రెడ్డితో పాటు అతడి తల్లి, సోదరిని ముందు పెట్టి తమ భూమి లోకి తమను వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి తమ భూమిని తమకు అప్పగించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ, శ్రీలత, కొండయ్య, అనంతలక్ష్మి, మహేందర్, ధనలక్ష్మి, తనీషా, సురేష్, గణేష్, మాధవరెడ్డి, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

