హసన్‌పర్తి, అక్టోబర్ 7: నియోజకవర్గ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్నానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సీతంపేట, భైరాన్‌పల్లి, పెంబర్తి, సూదన్‌పల్లి, నాగారం, హరిశ్చంద్రనాయక్ తండా, సిద్దాపూర్, జయగిరి, వంగపహడ్ గ్రామాల్లో రూ.51కోట్ల 12లక్షల 80వేలతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రమేశ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యేకు మహిళలు కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించాలని, అభివృద్ధి చేస్తున్న మీ బిడ్డ అరూరి రమేశ్‌ను మూడోసారి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామాల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి కూలీలకు టిఫిన్ బాక్స్, చేశారు.
ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్‌రెడ్డి, జడ్పీటీసీ సునీత, పాక్స్ చైర్మన్లు జక్కు రమేశ్‌గౌడ్, మెరుగు రాజేశ్‌గౌడ్, డివిజన్ అధ్యక్షుడు జంగకుమార్యాదవ్, మాజీ జడ్పీటీసీ కొత్తకొండ సుభాశ్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్‌కుమార్, సర్పంచ్‌లు, జనగాం శరత్, బొల్లవేని రాజురాణీ, జోరిక పూల, పెద్ది తిరుపతమ్మ-మల్లారెడ్డి, కుందూరు సాంబరెడ్డి, జనగాం ధనలక్ష్మి-కిరణ్, నునావత్ ఐలమ్మ మొగిళి, అరుణ్, పార్టీ మండల అధ్యక్షుడు బండి రజనీకుమార్, యూత్ అధ్యక్షుడు మేక భగవాన్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ వీసం సురేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రఘు, రాజు, ఉపసర్పంచ్ సునిల్, ఏలిమి రమేశ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పంజాల కుమార్, గోపి, మోటపోతుల రాజు, బాబు, సాంబరాజు మొగిలి పాల్గొన్నారు.
నయీంనగర్: పర్వతగిరి మండలం రోళ్లకల్కు చెందిన గౌడ కులస్తులు ఎమ్మెల్యే అరూరికి తమ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని హనుమకొండలోని ఆయన నివాస ఆవరణలో అందజేశారు. గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏకాంతంగౌడ్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.Distribution of