పోచమ్మమైదాన్ : వరంగల్ 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్లో టీఆర్ఎస్ నూతన కమిటీ ఎంపిక కోసం కృషి చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌కు స్థానిక టీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ సులోచన సారయ్య, జిల్లా నాయకులు కేతిరి రాజశేఖర్, డివిజన్ అధ్యక్షుడు ముడుసు నర్సింహ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే రమేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు పసులాది మల్లయ్య, ఉపాధ్యక్షులు అంకం రాజు వీరు, అమర్ రాజ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి మాచర్ల స్టాలీన్, కోశాధికారి పున్నం ప్రభాకర్, కార్యదర్శి కొంక వినాయకర్, మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల సరోజన, ప్రధాన కార్యదర్శి పసునూరి సరిత, కార్యదర్శి కన్నం విన్నమాల, ఈరెల్లి రజిత, రాజేశ్వరీ పాల్గొన్నారు.