ఖిలావరంగల్ : దళిత వాడల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 37వ డివిజన్ పడమరకోట దళితకాలనీలోని వీరుని గడ్డ వద్ద రూ. 75 లక్షలు నిధులతో సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణాకి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దళిత వాడల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ నిధులు కేటాయించిందన్నారు. ఇందులో భాగంగా రూ. 75లక్షలు నిధులతో దళిత వాడలో పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, మురికి కాల్వ నిర్మాణం చేపడుతామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక వసతులు కల్పిస్తామ్నారు.
కార్యక్రమంలో 37వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్‌యాదవ్, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, పీఏసీఎస్ డైరెక్టర్లు జూలూరి శ్రావణ్, గిరిప్రసాద్‌నగర్ అధ్యక్షుడు ఎండి. ఉల్ఫత్, నాయకులు నలిగంటి నవీన్, బిల్ల రవి, మంద శ్రీధర్‌రెడ్డి, బిల్ల రాంబాబు, శ్రీకాంత్, పవన్ పాల్గొన్నారు.