కరీమాబాద్/కాశీబుగ్గ/పోచమ్మమైదాన్, మార్చి 2: వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వరంగల్ 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి కోరారు. ప్రభుత్వం అందించిన స్మార్ట్ఫోన్లను బుధవారం ఆయన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్లకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ లక్ష్యానికనుగుణంగా సిబ్బంది పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పల్లం రవి, డాక్టర్ అరుణ్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అలాగే, రంగశాయిపేటలోని ప్రభుత్వం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలకు కార్పొరేటర్లు పోశాల పద్మ, గుండు చందన స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారని కార్పొరేటర్లు అన్నారు. కార్యక్రమంలో పోశాల స్వామి, గుండు పూర్ణచందర్, డాక్టర్ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లి అర్బన్ హెల్త్ సెంటర్లో ఆశ వర్కర్లకు కార్పొరేటర్ జన్ను షీభారాణి-అనిల్ సెల్ఫోన్లు పంపిణీ చేశారు. 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ కాశీబుగ్గలోని అర్బన్ హెల్త్ సెంటర్లో సెల్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ వర్కర్లు కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించారని కొనియాడారు. ఆశ వర్కర్లకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్, టీఆర్ఎస్ నాయకులు ఎండీ ఇక్బాల్, పెండ్యాల సోనీబాబు, తోట బాలరాజు, మంద రమేశ్, జక్కి అశోక్, గోశికొండ రాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ దేశాయిపేట అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని 12, 13, 22, 23వ డివిజన్లకు చెందిన ఆశ వర్కర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కావటి కవితా రాజుయాదవ్, సురేశ్‌కుమార్ జోషి, బస్వరాజు కుమారస్వామి, నాయకుడు ఆడెపు శ్రీనివాస్, డాక్టర్ తంగళ్లపల్లి భరత్‌కుమార్, సూపర్వైజర్ జన్ను కోర్నేలు పాల్గొన్నారు.