వరంగల్, ఫిబ్రవరి 28 : రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తున్నదని రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మ న్ నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కమిషన్ సభ్యులు పాకాల శ్రీహరిరావు, లక్ష్మారెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపితో కలిసి బ్యాంక్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతును రాజును చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా, ప్రతి ఎకరాకు నీరు, నిరంతర కరంట్ అందిస్తున్నారని అన్నా రు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసు కునేందుకే కమిషన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రైతులకు బ్యాంక్ రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఇతర రుణాలపై సమీక్ష చేశారు. హైకోర్టు, ఆర్బీఐ నియమ నిబంధనల ప్రకా రం రైతుకు లక్షా 60 వేల వరకు రుణం అందజేయాలని అ న్నారు. కౌలు రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా బ్యాంకర్లు రుణాలు అందజేయాలని సూచించారు. సమావే శంలో కార్యదర్శి శారదాదేవి, ఆదనపు కలెక్టర్ సంధ్యారాణి, శ్రీవాత్సవ, ఆర్డీవో వాసుచంద్ర, అధికారులు పాల్గొన్నారు.