గీసుగొండ, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ ఆశయాలను కొనసాగించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ పోతురాజుపల్లిలో శివాజీ 392వ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై శివాజీ విగ్రహానికి పూలమాల వేశారు. శివాజీని నేటితరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు సుంకరి శివ, చిన్ని, రమేశ్, ప్రభాకర్‌రావు, యాదరిగి, శంకర్, ధర్మేంద్ర, చిదంబరం, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ఆదర్శప్రాయుడు ఛత్రపతి శివాజీ
దుగ్గొండి/చెన్నారావుపేట: పోరాట వీరుడు ఛత్రపతి శివాజీ ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని ఆరెకుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు అన్నారు. దుగ్గొండి మండలంలోని రేఖంపల్లి, శివాజీనగర్, మర్రిపల్లి, లక్ష్మీపురం, గోపాలపురం, పొనకల్లో ఆరెకుల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో శివాజీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆరె క్షత్రీయ, సంక్షేమ సంఘాల రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు పాల్గొని శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆరెకుల సంఘం దుగ్గొండి మండల కమిటీ ఆధ్వర్యంలో ఆరెకులస్తులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని రేఖంపల్లి, శివాజీనగర్‌లో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాలకు పూలమాలు వేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రావు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరెకుల సంఘం నాయకులు గుండెకారి రంగారావు, లాండె రమేశ్, ఒలిగె నర్సింగరావు, సర్పంచ్‌లు లింగంపల్లి ఉమారవీందర్రావు, ఇంగోళి రాజేశ్వర్‌రావు, సుమలతానరేందర్, మాలగాని శ్రీనివాస్, మాలగాని రామారావు, మోర్తాల గణేశ్, ఎంపీటీసీలు రంపీస సోనీరతన్, విజయామోహన్రావు, చిరంజీవి, రాజేశ్వర్‌రావు, రమేశ్, రామారావు పాల్గొన్నారు. చెన్నారావుపేట మండలం కోనాపురంలో ఆరెకుల సంఘం సభ్యుల సమక్షంలో శివాజీ చిత్రపటానికి జిల్లా కమిటీ సభ్యుడు గుజ్జుల బాబురావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గుజ్జుల బక్కయ్య, దౌతపురం నాగరాజు, అంబీరు రాజేశ్వరరావు, లడె రాజేశ్వర్, దౌతపురం శంకర్రావు, లక్ష్మణరావు, రఘు, డోలె రాజేశ్వరరావు, కనుగుల రమేశ్, లడె బుచ్చిబాబు, అంబీరు రాజయ్య పాల్గొన్నారు.
శివాజీ చరిత్రను తెలియజేయాలి..
వర్ధన్నపేట/సంగెం/నల్లబెల్లి/కరీమాబాద్: వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో సర్పంచ్ కౌడగాని కవిత ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు శివాజీ జీవిత చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆరెకుల సంఘం ఆధ్వర్యంలో యువకులు కొత్తపల్లి నుంచి వర్ధన్నపేట పట్టణంలోని బస్టాండ్ వరకు జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆరెకుల సంఘం పెద్దలు, యువకులు, కొత్తపల్లికి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సంగెం మండలంలోని ఆశాలపల్లి, తీగరాజుపల్లిలో శివాజీ జయంతి నిర్వహించారు. ఆశాలపల్లిలో జీపీ ఎదుట శివాజీ చిత్రపటానికి సర్పంచ్ కిశోర్‌యాదవ్, తీగరాజుపల్లిలోని శివాజీ విగ్రహానికి సర్పంచ్ ఖర్జుగుత్త రమ-గోపాల్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆరెకుల సంఘం జిల్లా నాయకుడు హింగె శివాజీ నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో ఆరెకులస్తుల సమక్షంలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కవిత, వైస్ ఎంపీపీ శ్రీలతా శ్రీనివాస్‌గుప్తా, ఆరెకుల సంఘం అధ్యక్షుడు లకిడె శివాజీ, కార్యదర్శి గుండెసారి బాలరాజు, అండరకొండ రాజు, హింగోళి వీరన్న, కౌడగాని అంజన్న, జితేందర్, నగేశ్, మనోహర్, కరుణాకర్, గోవర్ధన్, రవి, రాజు, మనోజ్, నాగరాజు పాల్గొన్నారు. కరీమాబాద్‌లో శివాజీ చిత్రపటానికి ఆరె కటిక పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి గోగికార్ రవీందర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివాజీ సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో రాంచరణ్, శ్రీనివాస్, అశోక్, రమేశ్, సంఘం నాయకులు పాల్గొన్నారు.