నర్సంపేట, ఫిబ్రవరి 14 : మేడారం వెళ్లే భక్తులు ఆరోగ్యంపై తప్పనిసరిగా శ్రద్ధ వహించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. సోమవారం నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరలో భక్తులు కరోనా నిబంధనలు పాటించాలన్నారు. మేడారం వెళ్లే భక్తులకు బస్సు టికెట్‌తో పాటే మాస్క్‌ను అందజేస్తారన్నారు. అనారోగ్యానికి గురైతే వెంటనే అక్కడ ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో చికిత్స పొందాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని, సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణం వరకు వెళ్తాయన్నారు. న్రర్సంపేట నుంచి 222 బస్సులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రయాణికులకు జాతరకు తరలించడం, తిరిగి ఇళ్లకు చేరవేసే బాధ్యతను ఆర్టీసీ తీసుకుంటున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నల్ల మనోహర్‌రెడ్డి, రాయిడి దుశ్యంత్‌రెడ్డి, నాగిశెట్టి ప్రసాద్, సొసైటీ చైర్మన్ మూరాల మోహన్‌రెడ్డి, మోతె జైపాల్‌రెడ్డి, బండి రమేశ్, గ్రంథాలయ డైరెక్టర్లు గంప రాజేశ్వర్‌గౌడ్, పుట్టపాక కుమారస్వామి, గోనె యువరాజు, యాదగిరి, సారంగపాణి, యాదగిరి, అనిల్, వేణుగోపాల్‌రెడ్డి, పుల్లూరి స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు సీఎం జన్మదిన వేడుకలు..
నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించాలని ఎమ్మెల్యే పెద్ది కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రదాత, ఉద్యమ నేత కేసీఆర్ జన్మదిన సంబురాలను ఈనెల 15,16,17వ తేదీల్లో నిర్వహించాలని పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. దవాఖానలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో అన్నదానం, పండ్లు, దుస్తుల పంపిణీ చేయాలని కోరారు. ఈనెల 16వ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని, 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం చేపట్టాలని పిలుపునిచ్చారు.
రైస్‌మిల్లు ప్రారంభం
ఖానాపురం : మండలంలోని రాగంపేటలో నూతనంగా నిర్మించిన శివరాం రైస్ మిల్లును ఎమ్మెల్యే పెద్ది ప్రారంభించారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, తహసీల్దార్ జులూరి సుభాషిణి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, రైతుబంధు తుంగబంధం కన్వీనర్ వేజళ్ల కిషన్‌రావు, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, ఎంపీటీసీ బోడ భారతి, మర్రి కవిత, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.