నెక్కొండ, ఫిబ్రవరి 7: పల్లెల సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ జాటోత్ రమేశ్ పేరొన్నారు. మం డలంలోని ముదిగొండలో సోమవారం ఆయన సీసీ రోడ్డు ని ర్మాణ పనులను ప్రారంభించి మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామా ల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో రూ.95 లక్షలతో ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టామన్నారు. పల్లెల్లో మౌలిక వసతులు కల్పిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సర్పంచ్ శైలజ ప్రభాకర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ధర్మారెడ్డి, మండల నాయకులు కట్కూరి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ లింగాల అజయ్, ఉప స ర్పంచ్ అశోక్రావుతోపాటు పలువురు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
నర్సంపేట రూరల్: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మారు మూల గ్రామాలు, పల్లెలు అభివృద్ధి చెందాయని ఎంపీపీ మోతె కళావతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ అన్నారు. మండ లంలోని ముత్యాలమ్మతండాలో రూ. 10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీ పీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మా రుమూల గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు, సదుపాయా ల కల్పనకు ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రా మంలో 260 మీటర్లు రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ భూక్యా సైద, ఉప సర్పంచ్ లకావత్ రవినాయక్, టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు నూనావత్ శ్రీనివాస్‌నాయక్, భూక్యా రాజేందర్‌నాయక్, వార్డు సభ్యులు లక్ష్మణ్‌నాయక్, భీమ్లానాయక్, బానోత్ ఈర్య, కిరణ్, రాంచందర్, బాబ్జీ, శ్రీను, సంజీవ తదితరులున్నారు.