చెన్నారావుపేట, ఫిబ్రవరి 6 : దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని, అలాంటి పథకంపై సెటైర్లు వేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతల్లారా ఖబాద్దార్ అని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాల్నె వెంకన్నగౌడ్ హె చ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులను కేవలం ఓటుబ్యాంకు కోసమే కాంగ్రెస్, బీజేపీలు వాడుకున్నాయన్నారు. వారి అభివృద్ధికి బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించని బీజేపీ సర్కారుకు సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కులేదని ఘాటుగా విమర్శించారు. కాగా, మండల కేంద్రంలో అధ్యక్షుడు వెంకన్నగౌడ్ సమక్షంలో దళితసంఘ నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. అనంతరం డివిజన్ దళిత నాయకుడు కల్లెపల్లి సురేశ్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో దళితుల సంక్షేమానికి ఎమ్మెల్యే పెద్ది ప్రత్యేక చొరవ చూపించి వంద యూనిట్లు కేటాయించి దళితుల జీవితాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండీ రఫీ, దళిత నాయకులు తాళ్ల సునీల్, మాజీ జడ్పీటీసీ జే రాంరెడ్డి, అమీనాబాద్ సొసైటీ చైర్మన్ మురహరి రవి, అమ్మ రాజేశ్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు సాధు నర్సింగరా వు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సురేశ్, సొసైటీ డైరెక్టర్ బాబు, పీ నవీన్, ఎం కుమారస్వామి, పీ రాజేందర్, నర్మెట్ట సాంబయ్య, బరిగెల మహేందర్, పరకాల కొమురయ్య, టేకుల స్వామి, పీ రాజేశ్ పాల్గొన్నారు.
ఆత్మ బంధువులకు క్షీరాభిషేకం..
నల్లబెల్లి: రాష్ట్ర వ్వాప్తంగా దళిత బంధు అమలు చేస్తూ దళిత ఆత్మ బంధువుగా మారిన సీఎం కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటాలకు ఆదివారం దళిత సంఘాల నాయకులు మండల కేంద్రంలో క్షీరాభిషేకం చేశారు. సందర్భంగా సర్పంచ్ నానెబోయిన రాజా రాం మాట్లాడుతూ దళితుల కుటుం బాల్లో వెలుగులు నింపే దళిత బంధు పథకంపై అవాకులు చవాకులు మాట్లాడిన బీజేపీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాంయించకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నాగెల్లి ప్రకాశ్, సట్ల శ్రీనివాస్‌గౌడ్, పెద్దబోయిన రాజన్న, మిట్టపెల్లి అజయ్‌బాబు, పో డిశెట్టి శ్యాంబాబు, కే బాబు, సాగర్, కన్ని, శ్రీకాం త్, శ్రీను, సునీల్, కార్తీక్, సుమంత్, సుబ్బు పాల్గొన్నారు.
దళితబంధు కేటాయించడం హర్షణీయం..
నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గానికి దళితబంధు కేటాయించడంపై దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశా యి. ఈ మేరకు ఆదివారం ఎమ్మార్పీఎస్ టీఆ ర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దళిత బంధు కేటాయించడంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గానికి దళితబంధు వర్తింపచేసేందుకు దళితులను ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. అర్హులైన 15 మంది దళిత బంధుకు సంబంధించిన పేర్లను ఎమ్మెల్యేకు అందించారు. ఈ కార్యక్రమంలో నవీనస్వా మి, ఆరెపెల్లి బాబు, శోభన్, కుమారస్వామి, ఉప్పలయ్య, నవీన్, సుధాకర్, ఐలయ్య, చిలకబాబు, రాం బాబు, నవీన్, స్వామి తదితరులు పాల్గొన్నారు.