ఖానాపురం, నవంబర్ 14: రైతు శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన ధ్యేయమని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. మండలకేంద్రంలోని సొసైటీ కార్యాలయ ఆవరణలో ఆదివారం 68వ సహకార వారోత్సవాలను పురస్కరించుకుని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ రామస్వామినాయక్ మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, ఎరువులను విక్రయిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. 1923లో సహకార సంఘాలను నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలు కాకుండా రుణాలు అందించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే సహకార సంఘాల ముఖ్య ఉద్దేశమని వివరించారు. నాటి సహకార సంఘాల స్ఫూర్తి నేటికీ కొనసాగుతున్నదని వెల్లడించారు. ఖానాపురం సొసైటీ పరిధిలోని రైతులందరికీ సేవలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, డైరెక్టర్లు నీలం సాంబయ్య, భూషబోయిన రాజు, గంగాధర రమేశ్, అన్నమనేని రవీందర్రావు, శొంటి లక్ష్మణ్, తిరుపతి, మేకల కుమారస్వామి, జాడి అచ్యుతం, ఆబోత్ అశోక్, బొప్పిడి పూర్ణచందర్రావు, మల్యాల పోశెట్టి, బాలునాయక్, పూలునాయక్, దేవ, ముద్దంగుల రవి, సీఈవో ఆంజనేయులు, మేరుగు రాజు, భీమయ్య పాల్గొన్నారు.
వారోత్సవాలను జయప్రదం చేయాలి
మండలంలో సహకార వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురిజాలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో సొసైటీ చైర్మన్ ఆకుల రమేశ్‌గౌడ్ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పీఏసీఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సహకార వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమాల్లో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. సొసైటీ డైరెక్టర్లు, సంఘం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దుగ్గొండి మండలం మందపల్లి పీఏసీఎస్ ఆవరణలో చైర్మన్ గుడిపెల్లి శ్రీనివాస్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. నాచినపల్లి పీఏసీఎస్‌లో చైర్మన్ సుకినె రాజేశ్వర్‌రావు, మహ్మదాపురం పీఏసీఎస్‌లో చైర్మన్ ఊరటి మహిపాల్‌రెడ్డి జెండాలు ఆవిష్కరించి వేడుకలు జరిపారు. సహకార సంఘాల ద్వారా ప్రభుత్వం రైతులకు పంట రుణాలతోపాటు ఎరువులు అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ల పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. నల్లబెల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ జెండాను ఆవిష్కరించారు. సొసైటీ సీఈవో మొగిలి, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.