ఖానాపురం, సెప్టెంబర్ 19: రాష్ర్టాన్ని అడుగ డుగునా అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని రంగాపురం, కొత్తూరు, రాగంపే ట, ఖానాపురం, మనుబోతుల గడ్డ, బండమీది మామిడి తండా, బుధరావుపేట, ఉమ్మడి మంగళ వారిపేట, ధర్మారావుపేట గ్రామాల్లోని ఆసరా లబ్ధి దారులకు ఆయన పింఛన్ కార్డులు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ తాను రైతు బిడ్డనని, రైతులపై కేంద్రం అనుసరి స్తున్న తీరును చూస్తే ఎమ్మెల్యే పదవి ఊడినా, జైలుకి వెళ్లినా ఫర్వాలేదు కాని కేంద్రంపై పోరా టం చేయాలని ఉందన్నారు. పెన్షన్‌దారుల ఆశీ ర్వాదం ఉన్నన్ని రోజులు కేసీఆర్‌ను కేంద్రం ఏమీ చేయలేదని అన్నారు. ఉచితాలు వద్దని సంక్షేమ పథకాల ను పేదలకు అందకుండా చేసే కుట్ర జరుగుతున్నదని అన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచడమే తెలంగాణ, కేసీఆర్ విధానమని అన్నారు. ఎలాంటి పోరాటా లు లేకుండానే ఇక్కడి రైతుల 70 ఏళ్ల కలను సా కారం చేస్తూ పాకా లకు గోదావరి జలాలను తీసు కువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని అన్నా రు. ఇక్కడి గోదావరి జలాలను కావేరి నదికి అను సంధానం చేయడానికి కేంద్రం బడ్జెట్లో రూ. 6వేల కోట్లు కేటాయించిందని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ గోదావరి కావే రి అనుసంధానాన్ని సమర్థిస్తారా.. అని ప్ర శ్నించారు.
గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేసి పాకాలపై కేంద్రం పెత్తనం చేయాల ని చూస్త్తోందని అన్నారు. ఇక్కడి రైతులపై కేంద్రం పెత్తనం చేయాలని చూస్తే కేసీఆర్ నాయక త్వం లో మరో రైతు పోరాటం వస్తుందని హెచ్చరించా రు. త్వరలోనే కేంద్రప్రభుత్వ అసమర్థ పాలన, తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశవ్యా ప్తంగా అమలు చేసేవిధంగా సీఎం కేసీఆర్ దేశ ప ర్యటన చేయనున్నారని, అందుకు ప్రజల మద్దతు కావాలని కోరారు. ఖానాపురంలో పోచమ్మ తల్లి ఆలయానికి రూ. 40 లక్షలతో బీటీ రోడ్డు మం జూరు చేయించానని, అదేవిధంగా శ్మశానవాటి క వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి వచ్చే ఏడాది నిధు లు మంజూరవుతాయన్నారు. ఉమ్మడి మంగళవా రిపేట పరిధిలోని జీపీలన్నింటికి బీటీ రోడ్లు మం జూరు చేయిస్తానని అన్నారు. మంగళవారిపేట భూములకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వస్తాయని అన్నారు. ఉమ్మడి మంగళవారిపేటలో సీసీ రోడ్లకు రూ. కోటి మంజూరు చేస్తానని అన్నారు. కార్య క్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామ స్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, ఎంపీడీఓ సుమనవాణి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులు, ఎంపీ టీసీలు, తదితరులు పాల్గొన్నారు.