ఆత్మకూరు, జూలై 16 : ఆత్మకూరును త్వరలోనే మున్సిపాలిటీ చేస్తానని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారె డ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన 50 మంది బీజే పీ, కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ వంగాల స్వాతీభగవాన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ నత్తి తేజాకుమారీసుధాకర్ ఆధ్వర్యంలో శనివారం టీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువాలు కప్పి వారిని ఎమ్మెల్యే చల్లా టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీతో ఆత్మకూరు త్వరగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు సమీప రాష్ర్టాల్లో లేవని చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమంతో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని వివరించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త ర్వాతే పరకాల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని వివరించారు. ప్రతిపక్షాలకు చెందిన యువకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో యువకులు ముందు వరుసలో ఉండాలని పిలుపునిచ్చా రు. ఆగస్టు నుంచి 57 సంవత్సరాలు నిండిన వారికి పిం ఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులకు పింఛన్లు మం జూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలోని అన్ని వాడ ల్లో సీసీ రోడ్లు వేయిస్తానని అన్నారు. నియోజకవర్గంలో నే ఆత్మకూరుకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని, ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటాన ని భరోసా ఇచ్చారు. సంగె అరుణ్, ప్రదీప్, సుధీర్, బ య్య రాజ్‌కుమార్, ఇప్ప శ్రీనివాస్, గుండెబోయిన కు మార్తోపాటు 50 మంది పార్టీలో చేరారు.
కార్యక్రమం లో రెడ్‌క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకన్న, రెడ్‌క్రాస్ డైరెక్టర్ దుంపల్లపల్లి బుచ్చిరెడ్డి, జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ రవీందర్, సర్పంచ్‌లు మచ్చిక యాదగిరి, ఎంపీటీసీ బయ్య రమారాజు, గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొల్లోబోయిన రాధారవియాద వ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంతాల కేశవరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వా మి, పార్టీ గ్రామ అధ్యక్షుడు పాపని రవీందర్, పీఏసీఎస్ డైరెక్టర్ వీర్ల వెంకటరమణ, వార్డు సభ్యులు నత్తి రవీంద ర్, బైగాని రాజేందర్, రాసమల్ల అనితానరేందర్, రేవూ రి ప్రవీణ్‌రెడ్డి, రైతు బంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ బాషబోయినసాగర్ తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
నీరుకుళ్ల, ఆత్మకూరు గ్రామాల్లో మృతి చెందిన ఓదెల శ్రీనివాస్, ఓదెల రాజ్‌కుమార్, చింతపట్ల రమేశ్ కుటుంబాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించి ఆర్థికసాయం చేశారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.