వర్ధన్నపేట, జూన్ 10: జిల్లావ్యాప్తంగా పల్లెప్రగతి పనులతో గ్రామాలు పరిశుభ్రంగా తయారవుతున్నాయి. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి దివిటిపల్లిలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పల్లెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను స్వయంగా తెలుసుకొని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. సాయంత్రం సమయంలో గ్రామానికి చేరుకొని ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తుల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుంటారన్నారు. అలాగే, గ్రామంలోనే నిద్రిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి, ప్రత్యేక అధికారి సురేశ్‌కుమార్, ఎంపీడీవో రాజ్యలక్ష్మి, సర్పంచ్ బుంగ లత, ఎంపీటీసీ సోమయ్య, ఏపీవో నాగేశ్వర్ పాల్గొన్నారు. అలాగే, పల్లెప్రగతిలో భాగంగా మండలవ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించారు. శుక్రవారం ఏఈ దయాకర్ ఆధ్వర్యంలో విద్యుత్ సమస్యలను గుర్తించారు. లూజ్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, అదనపు విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇల్లంద శివారులో మిడిల్ పోల్స్ ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. ఈ మేరకు నివేదికను ఉన్నతాధికారులకు అందించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
క్రీడలు దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తాయి
క్రీడలు దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తాయని ఎంపీడీవో విజయ్‌కుమార్ అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా నల్లబెల్లి మండలంలోని మూడుచెక్కలపల్లెలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఎంపీడీవో శుక్రవారం మొక్కలు నాటారు. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఇంటింటికీ మరుగుదొడ్లు, భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు, పల్లెప్రకృతి వనాల ఏర్పాటుతో గ్రామాలు సుందరంగా తయారవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో కూచన ప్రకాశ్, సర్పంచ్ బానోత్ పూల్‌సింగ్, ఎంపీటీసీ దేవూనాయక్, కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు. గీసుగొండ మండలంలోని మరియపురంలో సర్పంచ్ అల్లం బాలిరెడ్డితో కలిసి తాసిల్దార్ సుహాసిని క్రీడా ప్రాంగణానికి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచే క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఊరూరా క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేయిస్తున్నట్లు తెలిపారు. మరియపురంలో ఉన్న రెండెకరాల ప్రభుత్వ స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామన్నారు. వారి వెంట కార్యదర్శి స్వప్న ఉన్నారు.
గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం
దుగ్గొండి: గ్రామాల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని దుగ్గొండి ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య అన్నారు. దుగ్గొండి మండలంలోని బిక్కాజిపల్లిలో శ్మశాన వాటిక ఏర్పాటు పనులను ఎంపీపీ ప్రారంభించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన పల్లెప్రగతి పనులను సకాలంలో వందశాతం పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, సర్పంచ్ సింగనబోయిన భాగ్యలక్ష్మి-లింగన్న, ఎంపీటీసీ బండి జగన్, పీఆర్ డీఈ ఇజ్జగిరి, ఏఈ వెంకటేశ్వర్లు, రాజేశ్వర్‌రావు, కార్యదర్శి పాల్గొనద్నారు. అలాగే, దుగ్గొండి మండలంలోని చలపర్తి, జీడికల్లో పారిశుధ్య పనులను ఎంపీడీవో కృష్ణప్రసాద్ పరిశీలించారు. పరిసరాల శుభ్రతతోనే గ్రామస్తులు ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. ప్రధాన రహదారి వెంట ఉన్న పిచ్చి మొక్కలు, డ్రైనేజీల్లో పూడిక మట్టిని జీపీ సిబ్బందితో తొలగింపజేశారు. సర్పంచ్ శారదాకృష్ణ, ఎంపీటీసీ రంపీస సోనీరతన్, ఉపసర్పంచ్ భాస్కర్, కార్యదర్శి సంతోష్, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
చురుగ్గా పారిశుధ్య పనులు
నర్సంపేటరూరల్: నర్సంపేట మండలంలోని ముగ్ధుంపురం, మహేశ్వరం, లక్నేపల్లి, రామవరం, గురిజాల, చిన్నగురిజాల, గుంటూరుపల్లి, జీజీఆర్‌పల్లి, రాజేశ్వర్రావుపల్లి, ఇటుకాలపల్లి, గార్లగడ్డతండా, ఇప్పల్‌తండా, ఆకులతండా, ముత్తోజిపేటలో సర్పంచ్‌లు, కార్యదర్శుల ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం జీపీ సిబ్బంది రోడ్లు ఊడ్చి చెత్తాచెదారాన్ని తొలగించారు. నర్సరీలను ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్, ప్రత్యేకాధికారులు, ఏఈవోలు భరత్, నవీన్, ఏపీఎం కుందేళ్ల మహేందర్, ఏఈ నితిన్, శ్రీనివాస్, సంతోష్‌బాబు పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ లు పెండ్యాల జ్యోతి, మాడ్గుల కవిత, గొడిశాల రాంబాబు, కొ డారి రవన్న, గొడిశాల మమత, సుజాత, పార్వతమ్మ, కోమల, బొజ్జ యువరాజ్, కార్యదర్శులు, కారోబార్లు పాల్గొన్నారు.