చెన్నారావుపేట, నవంబర్ 20 : క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని లింగగిరిలో తండ్రి దొడ్డా లింగయ్య జ్ఞాపకార్థం దొడ్డా మోహన్‌రావు నిర్వహిస్తున్న 31వ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్ బాలురు, బాలికల ఖోఖో పోటీలను ఎమ్మెల్యే పెద్ది జ్యోతి ప్రజ్వల న చేసి ప్రారంభించారు. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు చెందిన క్రీడాకారుల నుంచి గౌ రవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ.. ఓడినా గెలిచినా క్రీడాకారు లు క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నదన్నారు. మారుమూల ప్రాంతమైన లింగగిరిలో రాష్ట్ర స్థాయి పోటీల ను నిర్వహించడం గొప్ప విషయమన్నారు. తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత నిర్వహిస్తున్న 4వ స్టేట్ ఈవెంట్ అ ని అన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారు ఈ నెల 27న హిమాచల్‌ప్రదేశ్ జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయికి వెళ్లే క్రీడాకారులకు తన వంతు ఆర్థికసాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం దొడ్డా మోహన్‌రావు ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో అతిథులను సత్కరించారు. కార్యక్రమం లో ఎంపీపీ బదావత్ విజేందర్, జడ్పీటీసీ బా నోత్ పత్తినాయక్, సర్పంచ్ మాదారపు భాస్క ర్, ఎంపీటీసీ పర్కాల లక్ష్మీరాజన్న, రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోట్ల రా మకృష్ణ, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తో ట శ్యాంప్రసాద్, మాజీ జడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, టీఆర్ఎస్ నాయకులు గుంటి కిషన్, కొండవీటి ప్రదీప్‌కుమార్, ఆర్గనైజర్ కోట రాంబాబు, సూరిపల్లి ఎస్ఎంసీ చైర్మన్ పర్కాల వెంకటమల్లు తదితరులు పాల్గొన్నారు.