నర్సంపేట రూరల్, మే16 : రైతులు ధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని జడ్పీటీసీ కోమాండ్ల జయ, పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కమ్మపల్లి గ్రామంలో నర్సంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఏ-గ్రేడ్ ధాన్యం క్వింటాకు రూ.1960, కామన్ గ్రేడ్‌కు రూ.1940 ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్గుబెల్లి రంగారెడ్డి, ఎంపీటీసీ వల్గుబెల్లి విజయ, ఏఈవో నవీన్, టీఆర్ఎస్ మండల నాయకులు కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, వల్గుబెల్లి ప్రతాప్‌రెడ్డి, రైతులు వంగ మహేందర్, తడక రాజు, భీరం మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ మండలంలో..
నెక్కొండ: మండలంలోని చంద్రుగొండలో, దీక్షకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ జాటోత్ రమేశ్ ప్రారంభించారు. కార్యక్రంలో చంద్రుడొండ ఎంపీటీసీ , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, సర్పంచ్ బక్కి రాజమ్మ, దీక్షకుంట సర్పంచ్ సురేందర్, ఎంపీటీసీ లింగాల అజయ్, ఏపీఎం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల నాయకులు నరేందర్‌రెడ్డి, రాజు, ఏఈవో రంజిత్, సీసీ శారద, రమేశ్, గ్రామైఖ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అమీనాబాద్‌లో..
చెన్నారావుపేట: అమీనాబాద్ పీఏసీఎస్ పరిధిలో గల అమీనాబాద్, తిమ్మారాయిన్పహాడ్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ మురహరి రవి, జడ్పీటీసీ పత్తినాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తినాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బుర్రి తిరుపతి, జడ్పీకోఆప్షన్ సభ్యుడు రఫీ, చెన్నారావుపేట సర్పంచ్ కుండె మల్లయ్య, ఎంపీటీసీ కడారి సునీత సాయిలు, జాటోతు స్వామి, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి పాల్గొన్నారు.
చెన్నారావుపేట మండలంలో..
చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట, కోనాపురంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమంలో ఏవో అనీల్ మాట్లాడుతూ ఏఈవోలు టోకెన్స్ మంజూరు చేయాలని, వారికి మాత్రమే గోనె సంచులు ఇవ్వాలని కొనుగోలు కమిటీకి సూచించారు. కార్యక్రమంలో పాపయ్యపేట సర్పంచ్ ఉప్పరి లక్ష్మి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర గౌడ్, రాంబాబు, విఠల్, బాలు, కోనాపురం సర్పంచ్ సుజాత, రాజు, నరసింహా రాములు, కుమారస్వామి పాల్గొన్నారు.
బలవంతపురంలో..
దుగ్గొండి: మండలంలోని బలవంతపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో మయూరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీఎం గుజ్జుల రాజ్‌కుమార్, మండల సమాఖ్య అధ్యక్షురాలు తాళ్లపల్లి లక్ష్మీ, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
రాంపూర్ గ్రామంలో..
నల్లబెల్లి: మండలంలోని రాంపూర్ గ్రామంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ ప్లోర్‌లీడర్ పెద్ది స్వప్న ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, మండల పీఏసీఎస్ చైర్మన్, జిల్లా సహకారాల సంఘాల అధ్యక్షుల ఫోరం చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, ఎంపీడీవో విజయ్‌కుమార్, సర్పంచులు చింతపట్ల సురేశ్రావు, లావూడ్య తిరుపతినాయక్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ తక్కలపెల్లి మోహన్‌రావు, ఏపీఎం సునీత, సీఈవో మొగిళి, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
చింతలపల్లిలో..
సంగెం: చింతలపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ కళావతి ప్రారంభించారు. పీఏసీఎస్ చైర్మన్ బొమ్మగాని వెంకటేశ్వర్లు, ఎంపీపీ బొమ్మ పావని, వైస్ చైర్మన్ రవింధర్, ఉపసర్పంచ్ బండి రాధిక, ఏఈవో బింధు, నాయకులు యుగేంధర్ పాల్గొన్నారు.
కొమ్మాల, గీసుగొండ గ్రామాల్లో..
గీసుగొండ: కొమ్మాల, గీసుగొండ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ పోలీసు ధర్మారావు ప్రారంభించారు. ఎంపీపీ భీమగాని సౌజన్య, కొమ్మాల సర్పంచు వీరాటి కవిత, గీసుగొండ సర్పంచు దౌడు బాబు, గీసుగొండ సోసైటీ చైర్మన్ రడం శ్రీధర్, గీసుగొండ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరగోని రాజుకుమార్, నాయకులు పాల్గొన్నారు.