e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News ముగిసిన ఎర్రగట్టు గుట్ట బ్రహ్మోత్సవాలు

ముగిసిన ఎర్రగట్టు గుట్ట బ్రహ్మోత్సవాలు

ముగిసిన ఎర్రగట్టు గుట్ట బ్రహ్మోత్సవాలు

3 లక్షల మంది భక్తుల హాజరు
హసన్‌పర్తి, ఏప్రిల్‌ 1 : ఎర్రగట్టు గుట్ట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు వేద పండితులు పార్థసారథి, శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో రథోత్సవం నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగమ్మ, లక్ష్మీదేవి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను రథాలపై పెట్టి, డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా హసన్‌పర్తి, భీమారం గ్రామాల్లోని వేంకటేశ్వరాలయాలకు తీసుకెళ్లారు. దీంతో ఎర్రగట్టు జాతర ముగిసింది. ఐదు రోజుల జాతరకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు హాజరైనట్లు ఈవో కిషన్‌రావు, ఆలయ కమిటీ చైర్మన్‌ సదానందం చెప్పారు. జాతర విజయవంతం కావడానికి కృషి చేసిన పోలీసులు, వలంటీర్లు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు మూల దేవేందర్‌, వీసం రవీందర్‌రెడ్డి, రఘు, ఉప్పు ప్రభాకర్‌, ప్రియాంక, సదానందం, కల్యాణ మండపం అధ్యక్షుడు వెంకటేశం, పుథ్వీరాజ్‌, సట్కూరి సంతోష్‌రాజ్‌, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చుడండి

గో మహాగర్జనలో అపశ్రుతి.. సభా వేదికపై గుడారాలు దగ్ధం

ఖర్చు 400 కోట్లు.. ఆమ్దాని 4 లక్షల కోట్లు!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముగిసిన ఎర్రగట్టు గుట్ట బ్రహ్మోత్సవాలు

ట్రెండింగ్‌

Advertisement