హనుమకొండ చౌరస్తా : వరంగల్ జిల్లా చెస్ సమైక్య ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాస్థాయి అండర్-17 చెస్ పోటీలు ( Chess competitions ) హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఉత్సాహంగా జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారని నిర్వాహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
పోటీల ముగింపు కార్యక్రమంలో రెడ్‌క్రాస్ మెంబర్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు.ఆయన మాట్లాడుతూ ఆటలో గెలుపు, ఓటములు సహజమని అన్నారు. పిల్లలను సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. చెస్ క్రీడాకారుడు అర్జున్ను ఆదర్శంగా తీసుకొని పిల్లలను చదరంగం వైపునకు ప్రోత్సహించాలని సూచించారు.
రాష్ట్రస్థాయికి గండు రిత్విక్, జాన్వి తోట, శ్రేయన్ రామ్ శివరాత్రి, దర్మూల ఆదిత్య సాయి, బాలికల విభాగంలో శిలాస్య బోనాల, వెన్నమల్ల దస్మిక, బి.దీపిక, వెన్నమల్ల దిలీషా ఎంపికైనట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో మూడో వారంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వరంగల్ జిల్లా తరుఫున ప్రాతినిద్యం వహిస్తారని నిర్వహణ కార్యదర్శి తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్స్ డి.ప్రేమ్‌సాగర్, డి.వైశాలి, రజనీకాంత్ పాల్గొన్నారు.