హసన్‌పర్తి, జూలై 21 : తెలంగాణలోని గ్రామాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని బైరాన్‌పల్లి, అర్వపల్లి, హరిశ్చంద్రనాయక్ తండాలో రూ.1.36కోట్లతో చేపట్టిన వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డు, పబ్లిక్ టాయిలెట్స్, అంతర్గత సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అరూరి మాట్లాడుతూ రాష్ట్రం లో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదన్నారు. ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
పల్లె ప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అలాగే, మండలంలోని సిద్ధాపూర్, బైరాన్‌పల్లి, మల్లారెడ్డిపల్లి, అర్వపల్లి గ్రామాలకు చెందిన 55 స్వయం సహాయక సంఘాలకు రూ.3.50కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలను ఎమ్మెల్యే రమేశ్ పంపిణీ చేశా రు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు లలితాయాదవ్, ఎంపీపీ కేతపాక సునీత, వైస్ ఎంపీపీ బండా రత్నాకర్‌రెడ్డి, జడ్పీటీసీ రేణుకుంట్ల సునీత, పీఏసీఎస్ చైర్మన్ జక్కు రమేశ్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు సాంబరెడ్డి, జెన్నయ్య, ఐలమ్మ-మొగిలి, ధనలక్ష్మి-కిరణ్, ఎంపీటీసీలు హరికాంత్‌రెడ్డి, మంజుల- కుమారస్వామి, నాయకుడు చిరంజీవి పాల్గొన్నారు.