ఖిలావరంగల్, సెప్టెంబర్ 12: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16న నిర్వహించే నియోజక వర్గ స్థాయి ర్యాలీకి భోజన ఏర్పాట్లకు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే వేదిక దగ్గరకు వచ్చే ప్రజలకు అవసరమయ్యే కుర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా భోజన ఏర్పాట్లలో ఇబ్బందులు రాకుండా సరిపడే ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేయా న్నారు.
ఒక్కొక్క విభాగానికి ఒక్కో ఇన్చార్జి నియమించాలన్నారు. 17న హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణ అనంతరం ప్రారంభించనున్న ఆదివాసీ, బం జారా భవన్‌కు ఆదివాసీలను తరలించేందుకు అధికారులు బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. అలా గే 18న నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు, సాతంత్య్ర సమరయోధులను, రచయితల సన్మానికి ఏ ర్పాట్లు చేయాలని దేశించారు. ఈ సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, బీ హరిసింగ్, ఆర్డీవో మహేందర్‌జీ, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చే దరఖాస్తులను సత్వరమే స్పందించాలని కలెక్టర్ గోపి సూచించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో 49 మంది ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్డీదారులు భూములకు సంబంధించిన వివరాలను మీ సేవ కేంద్రాల్లో సరియైన రీతిలో నమోదు చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి, ప్రజల మన్నలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హరిసింగ్, శ్రీవత్స, ఆర్డీవో మహేందర్ జీ, డీఆర్డీఏ పీడీ సంపత్‌రావు పాల్గొన్నారు. సీఏపై చర్యలు తీసుకోవాలి
మండలంలోని కొత్తూరు మహిళా సంఘాల సంఘాల్లో అవినీతికి పాల్పడిని సీఏ విజితపై పూర్తిస్థాయిలో విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం వీవో అధ్యక్షురాలు శారద ఆధ్వర్యంలో పలువురు మ హిళా సంఘాల సభ్యులు గ్రీవెన్స్‌లో కలెక్టర్ గోపి, పీడీ సంపత్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ కలెక్టర్, పీడీలు సీఏ అవినీతిపై విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. లలిత, విజయ, సంధ్య, స్వప్న, ఝూన్సీ, వస్మిత, రేణుక, లక్ష్మి, పద్మ, అనిత తదితరులు పాల్గొన్నారు.