నల్లబెల్లి, సెప్టెంబర్ 10: నిరుపేదల జీవితాల్లో భరోసా నింపేందుకే సీఎం కేసీఆర్ కొత్త పింఛన్లు మంజూరు చేశారని పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మండలానికి 1,474 పింఛన్లు మంజూరు కాగా, మండలంలోని నారక్కపేట, రుద్రగూడెం, నందిగామ, రేలకుంట, లెంకలపల్లి, నల్లబెల్లి, గుండ్లపహాడ్, బజ్జుతండా 733 మంది లబ్ధిదారులకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మొదటి విడత పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలోనూ సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. నల్లబెల్లి నుంచి గిర్నిబావి వరకు రూ.15కోట్ల వ్యయంతో డబుల్ తార్ రోడ్డు మంజూరు కాగా, టెండర్ పూర్తయ్యిందని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు.
వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ర్టాన్ని దేశంలోనే ముందువరుసలో నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మత తత్వ బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నిధులు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. తెలంగాణ రైతుల నడ్డి విరిచేందుకు మోదీ సర్కార్ విద్యుత్ సంస్కరణల పేరుతో వ్యవసాయ మోటర్లకు మీటర్ల ఏర్పాటుకు కుట్ర చేస్తోందన్నారు. ఇది అమలైతే హార్స్ పవర్‌కు రూ.500 చొప్పున త్రీ హెచ్‌పీ మోటర్‌కు ఏడాదికి రూ.18వేలు విద్యుత్ బిల్లు రైతు చెల్లించాల్సి వస్తుందని వివరించారు. కేంద్రం రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్, ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో ప్రకాశ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి