నర్సంపేట/నర్సంపేటరూరల్/దుగ్గొండి, సెప్టెంబర్ 9: తన రచనలు, కవిత్వం ద్వారా తెలంగాణ ప్రజలను జాగృతం చేసిన మహాకవి కాళోజీ నారాయణరావు అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో కాళోజీ 108వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పెద్ది మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని కాళోజీ తన రచనలు, కవిత్వం ద్వారా ప్రజలకు వివరించారని గుర్తుచేశారు. తెలంగాణ యాస, భాషను ఆయన వెలుగులోకి తెచ్చారన్నారు. తెలంగాణ తొలి, మలి దశ పోరాటాల్లో కాళోజీ సేవలు మరువలేనివని తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుంటి రజినీకిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర సభ్యుడు రాయిడి రవీందర్‌రెడ్డి, నాయకులు బీరం సంజీవరెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, కమిషనర్ నాయిని వెంకటస్వామి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ బీ చంద్రమౌళి కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు. నర్సంపేటలోని మాంటిస్సోరి పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ ఎర్ర జగన్మోహన్రెడ్డి, ఊర్మిళ పాల్గొన్నారు.
అంతేకాకుండా ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మోతె కళావతి, ఎంపీడీవో అంబటి సునీల్‌కుమార్‌రాజ్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ వాసం రామ్మూర్తి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేశారు. లక్నేపల్లి బాలాజీ టెక్నోస్కూల్, గురిజాల హైస్కూల్లో హెచ్ఎంలు వెంగళ మురళి, పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్‌రెడ్డి, గుడిపూడి రాంచందర్‌రావు కాళోజీకి నివాళులర్పించారు. దుగ్గొండి మండలం గిర్నిబావిలోని ఎంజేపీటీ గురుకులంలో ప్రత్యేకాధికారి దేవేందర్, మండలకేంద్రంలోని ఆదర్శవాణి ఇంగ్లిష్ మీడియం పాఠశాలతోపాటు తొగర్రాయి, దేశాయిపల్లి, ముద్దునూరు, తిమ్మంపేట, గిర్నిబావి, రంగాపురం, మందపల్లి ప్రభుత్వ పాఠశాలలు, గిర్నిబావిలోని న్యూవిజన్, మాతృశ్రీ, భద్రుక డిగ్రీ మహిళా కళాశాలలో హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిలో పాల్గొన్నారు.
సంగెం/నెక్కొండ/నల్లబెల్లి/గీసుగొండ/వర్ధన్నపేట: ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా సంగెం ఎంపీడీవో కార్యాలయంతోపాటు జీపీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటాలకు నివాళులర్పించారు. ఎంపీపీ కళావతి, విద్యుత్ డీఈ మల్లికార్జున్, ఏడీ నర్సింహరావు, కాపులకనపర్తి ఏఈ తిరుపతిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. నెక్కొండ ప్రభుత్వ జానియర్ కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ చందా రమణాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఎం బాబు ఆధ్వర్యంలో కాళోజీ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో రచనలు చేశారని, వ్యంగ్య కవిత్వం రాయడంలో ఆయన దిట్ట అని కొనియాడారు.
నల్లబెల్లిలోని జీపీ కార్యాలయంలో సర్పంచ్ నానెబోయిన రాజారాం ఆధ్వర్యంలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గీసుగొండ మండలంతోపాటు గ్రేటర్ వరంగల్ 15, 16వ డివిజన్వ్యాప్తంగా కాళోజీ జయంతి నిర్వహించారు. ఎంపీడీవో కార్యాయలంలో ఎంపీడీవో రమేశ్, గొర్రెకుంట జడ్పీహెచ్ఎస్లో హెచ్ఎం అనిత కాళోజీ సేవలను కొనియాడారు. ఎంపీవో ప్రభాకర్, సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వర్ధన్నపేట మండలంలో కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలతోపాటు ఇల్లందలో కాళోజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయపర్తి మండలవ్యాప్తంగా కాళోజీకి నివాళులర్పించారు. జడ్పీటీసీ రంగు కుమార్, ఏవో వీరభద్రం, సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా/కరీమాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు 108వ జయంతిని టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రాంకిషన్ ఆధ్వర్యంలో హెల్త్ యూనివర్సిటీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, రాష్ట్ర సహాయాధ్యక్షుడు కోలా రాజేశ్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు గద్దల రాజు, వంశీధర్బాబు, తోట చందర్, దుర్గారావు, సిటీ అధ్యక్షుడు వెలిశాల రాజు, ఎంజీఎం విభాగం అధ్యక్షుడు రవికుమార్ పాల్గొన్నారు. అలాగే, ఎంజీఎం పరిపాలన భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు. మామునూరులోని బెటాలియన్‌లో కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
గిర్మాజీపేట: తొలిమెట్టు రెండో దఫా శిక్షణను ఈ నెల 12, 13వ తేదీల్లో జిల్లాస్థాయిలో ఖిలావరంగల్‌లోని తాళ్ల పద్మావతి పాఠశాలలో రెండురోజులపాటు నిర్వహించనున్నట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు. సెప్టెంబర్ 15న మండల ‘ఎఫ్ఎల్ఎన్’ నోడల్ ఆఫీసర్లు సంబంధిత సీఆర్పీలు, కాంప్లెక్స్ పరిధిలోని విషయ నిపుణులకు మండలాల వారీగా శిక్షణ ఇస్తారన్నారు. శుక్రవారం డీఈవో కార్యాలయ సిబ్బంది కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు.