వరంగల్ మహానగరం ప్రశాంతతకు మారుపేరని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ మహానగరంలో గణేశ్ నిమజ్జనం, ఈ నెల 16,17,18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మూడు రోజుల కార్యక్రమాల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు.
వరంగల్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక వరంగల్ నగరం ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తున్నది, ఈ పరంపరను కొనసాగించుకునేలా అందరం కలిసి కృషి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పండుగల నిర్వహణలో వరంగల్‌కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, వినాయక నిమజ్జనం ఏర్పాట్లు అదే స్థాయిలో ఉంటాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఈ నెల 16 నుంచి నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
వరంగల్ మహానగరంలో గణేశ్ నిమజ్జనం, ఈ నెల 16,17,18 తేదీల్లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాల నిర్వహణపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం హనుమకొండలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరం ప్రశాంతతకు మారుపేరుగా ఉన్నదని, అందరం కలిసి దీన్ని కొనసాగించుకుందామని అన్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు.
వినాయక నిమజ్జనం రూట్ మ్యాప్, ఏర్పాట్లపై వినాయక మండళ్ల బాధ్యులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. దారి మళ్లింపు, నిమజ్జన ప్రాంతాలు, పారింగ్ స్థలాలు, ప్రజలు పాటించాల్సిన ట్రాఫిక్ నిబంధనలపై ముందే ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో పోలీసు శాఖ భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు. నిమజ్జానికి అవసరమైన క్రేన్లు, ఇతర సామగ్రిని త్వరగా సమకూర్చుకోవాలని చెప్పారు. పిల్లలు, మహిళలకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా పోలీసు శాఖ ఏర్పాట్లు చేయాలని అన్నారు.
ఈనెల 16, 17, 18న తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, వీటిని విజయవంతానికి చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం అన్ని కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల కార్యక్రమాలు ఘనంగా జరుగాలని చెప్పారు. మూడు రోజుల కార్యక్రమాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు.
వరంగల్ పోలీసు కమిషనర్… వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సమన్వయ బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సుందర్రాజ్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, వరంగల్ కలెక్టర్ గోపి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.