నర్సంపేట, సెప్టెంబర్ 3: : గణేశ్ నవరాత్రి వేడుకల్లో శనివారం మండపాల వద్ద అన్నదానాలు జరిగాయి. నర్సంపేటలోని ఎన్జీవోస్ కాలనీలోని విఘ్నేశ్వరుడి మండపం వద్ద వార్డు కౌన్సిలర్ దేవోజు తిరుమల సదానందం ఆధ్వర్యంలో మహాన్నదానం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజనీకిషన్ ప్రారంభించారు. కౌన్సిలర్లు శీలం రాంబాబు, వేల్పుగొండ పద్మ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గంపరాజేశ్వర్గౌడ్, కో ఆప్షన్ సభ్యురాలు నాయిని సునీత, వార్డు అధ్యక్షుడు కొల్లాపురం రాజేశ్‌కుమార్, యూత్ అధ్యక్షుడు కుసుంభ నిరంజన్ పాల్గొన్నారు.
నర్సంపేట రూరల్: మండలంలోని భాంజీపేట, నర్సంపేట పట్టణం సర్వాపురంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. సర్పంచ్ పలకల పూలమ్మ, వార్డు సభ్యులు ప్రారంభించారు. నర్సంపేట పట్టణం సర్వాపురం ఆదివాసీ టీచర్స్ కాలనీలోని గణనాథుడి మండపంలో ఆదివాసీ మహిళలు అర్చకులు దాస్యం రంగనాథస్వామి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. గొండి పాపయ్య, స్వరూప, ఈక రాజయ్య, సులోచన, దనసరి కృష్ణమూర్తి, అరుణ, భాగ్యలక్ష్మి, యాకలక్ష్మి, లక్ష్మి, శాంతకుమారి, పుష్పలత ఉన్నారు.
ఖానాపురం: మండలం ధర్మరావుపేటలో భగత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద వెన్ను అండమ్మ, సమ్మయ్య దంపతులు అన్నదానం చేయగా సర్పంచ్ శ్రుతి ప్రారంభించారు. పూర్ణచందర్, పోతరాజు కర్ణాకర్, జింకల అశోక్, కత్తాల వెంకన్న, కర్ర రమేశ్, ఐలయ్య, మేకల కుమార్, మేడి సమ్మయ్య పాల్గొన్నారు.
కరీమాబాద్: కరీమాబాద్‌లోని ప్రధాన రహదారిపై సాయిగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వరంగల్ ఏసీపీ గిరికలకోట, మిల్స్‌కాలనీ సీఐ శ్రీనివాస్ అన్నదానం ప్రారంభించారు. వడ్డెపల్లి రాజేశం, కందగట్ల నారాయణ, గోనె రాంప్రసాద్, పున్నంచందర్, గోనె రాజు, వంచనగిరి లవణ్, కడారి కుమారస్వామి, బుక్‌స్టాల్ భాస్కర్, అక్తర్, బూర మాదవ్, కొలిపాక శ్రీనివాస్, కోరె కృష్ణ పాల్గొన్నారు.
మట్టెవాడ: వరంగల్ నగరంలోని బట్టల బజార్ వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలోని గజానన ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం డాక్టర్ రాజేంద్రప్రాద్, అల్లాడి అప్పారావు, సూర్యం, గోవిందరాజులు, శ్రీనివాస్, రఘువీర్ పాల్గొన్నారు. వరంగల్ ఉప్పులవాడలోని శ్రీసాయియూత్ అసోసియేషన్ ఆధ్యర్యంలో అన్నదానం చేశారు. జి సందీప్, అశోక్, సచిన్ పాల్గొన్నారు. వరంగల్ రామన్నపేటలోని శ్రీశ్వేతార్క మూలగణపతి అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. 15 ఏళ్లుగా మట్టి గణపతిని పూజిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు పూజారి కుమారస్వామి, దేవులపల్లి శ్రీధర్, తాళ్ల సురేష్, సంజీవ్, సంగెపు రాహుల్ తెలిపారు.
గిర్మాజీపేట: నగరంలోని 33వ డివిజన్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని స్నేహయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం అన్నదానం చేశారు. స్థానిక కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ దంపతులు భోజనం వడ్డించి ప్రారంభించారు. యూత్ సభ్యులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
దుగ్గొండి: మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే గురుకులంలో ఉపాధ్యాయలు ప్రత్యేకాధికారి దేవేందర్‌తో కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. తొగర్రాయి గ్రామంలో అన్నదానం చేశారు. శివాజీనగర్‌లో సర్పంచ్ దంపతులు అన్నదానం చేశారు.
కాశీబుగ్గ: లక్ష్మీగణపతి పరపతి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పంచామృత అభిషేకం నిర్వహించారు. ఎస్ఆర్నగర్ కట్టమైసమ్మ వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మహాన్నదానం చేపట్టారు. బిజ్జా సత్యనారాయణ, రజిత, జయంత్, కోటి, భరత్, కర్ణాకర్, శ్రవణ్, ప్రశాంత్, రాజ్‌కుమారు పాల్గొన్నారు.